The Paradise nani: ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నాని మాట్లాడిన మాటల గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. న్యాచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాని తాజాగా నటించిన సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. మూవీ సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలెట్‌గా నాని స్పీచ్ :
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్‌గా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా నాని స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలుపెట్టాయి. నాని ఎప్పుడూ కూడా ఎవరి మీదా చాడీలు చెప్పరు. తన పని తాను చూసుకుని పోయే టైప్. పక్క విషయాల్లో కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. జనాలకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాను అన్న విధంగా ఉంటారు.
కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ నాని ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడినట్లు అనిపించింది. స్టేజ్‌పైకి వచ్చిన నాని తన సినిమా గురించి పొగుడుతూనే, తన సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అన్న విషయాలను చెబుతూనే.. తనని తొక్కేయడానికి ఒక టీం కాచుకుని కూర్చుంది అనేలా మాట్లాడారు.
నాని ఏమన్నారంటే? :
“మనం ఎదుగుతూ ఉంటే మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా పెరుగుతుంది. నెగిటివిటీని మనం పట్టించుకోకూడదు. అలాగే పాజిటివిటీని పట్టుకుని ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని చాలామంది కోరుకుంటారు. మనం ఎదిగే కొద్దీ మనం గెలవాలని కోరుకున్న వాళ్లు పెరిగినట్లే, మనం ఓడిపోతే చూద్దాం అని నవ్వుకునే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు పెరుగుతారు.
కానీ నన్ను ఓడించాలనుకునే వారిని నేను ఓడించడానికి ప్రయత్నించడం లేదు. నేను గెలుస్తాను అని నమ్మే వాళ్లని మాత్రమే గెలిపించడానికి కష్టపడుతున్నాను. మీరు నాకు 100లకు సరిపడా ప్రేమను ఇచ్చారు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఎంటర్‌టైన్ చేస్తాను. మనల్ని ఎవరు ఆపలేరు. ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది” అంటూ నాని మాట్లాడారు.
also read: Radha case:పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అలనాటి హీరోయిన్ రాధ!
నానిని తొక్కేయడానికి చూస్తున్న బ్యాచ్ ఏంటి? :
అయితే నానిని తొక్కేయడానికి చూస్తున్న బ్యాచ్ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు, గతంలో నాని పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసిన టైంలో ఒక సెపరేట్ పొలిటికల్ బ్యాచ్ నానిపై కావాలని నెగిటివ్‌గా ట్రోల్ చేశారు. లేనిపోని నిందలు వేశారు.
ఇక ఆ సమయంలో ఆ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన కొందరు బడా నిర్మాతలు, సినీ పెద్దలు నానిని పరోక్షంగానే టార్గెట్ చేశారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. నానితో ఆ బడా నిర్మాతలు సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు అని కూడా చాలామంది అప్పట్లో మాట్లాడుకున్నారు.
also read: Dilraju: పవన్ కళ్యాణ్ చేసిన సహాయం మర్చిపోలేను.. దిల్ రాజ్ కామెంట్స్..
నాని కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ:
బహుశా నాని ది ప్యారడైజ్ ని అలాంటి వాళ్లు తొక్కేయడానికి చూస్తున్నారేమో.. అందుకే పరోక్షంగా నాని ఇలా కౌంటర్ ఇచ్చారేమో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. నాని స్టేజ్‌పై మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నాయి.
నాని కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకుంటాడు అంటున్నారు అభిమానులు.




