Nani:నాని.. నాని.. నాని.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమోగిపోతుంది. దానికి కారణం ‘పారడైజ్’ సినిమా అని చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పారడైజ్’. ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.
రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ఫ్యాన్ మీట్ అభిమానులను బాగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేలా చేసింది. మరీ ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైం తన కెరీర్లో నాని ఒక స్పెషల్ డిఫరెంట్ రోల్‌ను చూస్ చేసుకోవడం, జడల్ అనే క్యారెక్టర్లో లీనమై నటించడం అభిమానుల్ని ఇంకా ఇంప్రెస్ చేసేసింది.
వైరల్ అవుతున్న నాని ‘పారడైజ్’ లుక్స్:
ఇప్పుడు సోషల్ మీడియాలో నాని(Nani)కి సంబంధించిన ‘పారడైజ్’ లుక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ‘పారడైజ్’ సినిమా కోసం నాని, కయాదు లోహర్ బాగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్గా సుమతో కలిసి ఒక చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో భోజనం కూడా చేశారు.
ఈ మూమెంట్లోనే నాని ‘పారడైజ్’ సినిమాకు సంబంధించి బోలెడు విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేకాదు, తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు కూడా అభిమానుల కోసం బయటపెట్టారు.
also read:Balakrishna :శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బాలయ్య దర్శనం.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్!
డైటింగ్‌పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ :
ఈ క్రమంలోనే ఫుడ్ తింటూ నాని ఓ విషయంపై ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. చాలామంది డైటింగ్.. డైటింగ్ అంటారు. ఏవేవో తింటూ ఉంటారు. కానీ అదంతా మన ఇంటి ఫుడ్ ముందు వేస్ట్. బయటకు వెళ్లినప్పుడు రెండు మూడు రోజులు బయట దొరికేవి బాగా తింటాం. కానీ మూడో రోజు మాత్రం మన ఇంజన్ స్టాప్ అయిపోతుంది అంటూ ఒక రకంగా నవ్వుతాడు.
అది ఏంటో అందరికీ అర్థమైంది. రావాల్సింది బయటికి రాదు, పోవాల్సింది లోపలికి పోదు.. అంటూ నవ్వుతాడు. అక్కడే ఉన్న సుమ, కయాదు కూడా నవ్వుతారు.
also read:Nani: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్న నాని..!
లిమిట్లో తింటే చాలు అంటున్న నాని :
ఇక నాని వివరిస్తూ.. డైటింగ్ అనేది కూడా ఒక రాంగ్ పద్ధతే. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి అన్నం తింటూ బ్రతుకుతాం.. అన్న ప్రసన్నం అని.. అందుకేగా అంటారు అంటూ సుమ కౌంటర్ ఇస్తుంది.
అన్నం తినకుండా ఉంటే రాత్రి సరిగా నిద్ర పట్టదు. ఫుల్లుగా తినేయాలి అని కాదు. ఏదైనా లిమిటెడ్ పోర్షన్‌లోనే అన్నం, పప్పు, పచ్చడి, పెరుగు ఇవి తింటేనే నాకు కడుపు నిండినట్లు ఉంటుంది.
ఇక డైటింగ్ అంటారా.. ఏవేవో తిని ఆరోగ్యం పాడు చేసుకునే బదులు, మనం చిన్నప్పటి నుంచి తిని పెరిగిన ఫుడ్‌ను లిమిట్ పోర్షన్లో తినాలి. దానికి తగ్గట్లు వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే సరిపోతుంది అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని మాటలు :
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు, నాని మాటలు విని.. ఇది ఎవరో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్‌కి బాగా కౌంటర్ ఇచ్చినట్లు ఉన్నాడే అంటున్నారు అభిమానులు.
ఎప్పుడు డైటింగ్.. డైటింగ్ అంటూ వాళ్లు ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటారు. నాని వాళ్లకి పరోక్షంగా ఇలా కౌంటర్ ఇచ్చినట్లు ఉన్నాడు అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.




