Faria Abdullah:ఫరీయ అబ్దుల్లా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్‌లో ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బోలెడు సినిమాల్లో నటించింది అని చెప్పలేము. కానీ నటించిన కొన్ని సినిమాల్లో కూడా తనకు స్పెషల్ మార్క్ దక్కించుకుంది. అలాంటి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువ మంది హీరోయిన్స్‌కే ఉంటుంది. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో నటించి కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్ కంటే కూడా ఫరీయ అబ్దుల్లాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ఒప్పుకోక తప్పదు.
యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఫరీయ అబ్దుల్లా :
తాజాగా ఫరీయ అబ్దుల్లా(Faria Abdullah) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన లైఫ్‌లో జరిగిన విషయాలు, సినీ ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తున్న విషయాలు అన్నీ చెప్పుకొచ్చింది. రీసెంట్‌గా జరిగిన బోనాల ఇష్యూను కూడా ఆమె ప్రస్తావించింది. ఇదే క్రమంలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది.
also read:Producer Chaitanya Reddy:ఛార్మీ- పూరీ జగన్నాథ్ పై సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత..!
ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? :
“ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎవరితో షేర్ చేసుకుంటారు?” అన్న విధంగా హోస్ట్ ప్రశ్నించారు. దీనికి ఫరీయ అబ్దుల్లా తడుముకోకుండా “అల్లు అర్జున్” అంటూ సమాధానం చెప్పింది.
అదేంటి? మీకు అల్లు అర్జున్‌తో ఎలా ఫ్రెండ్‌షిప్ అయింది? మీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదా? అంటూ తిరిగి ప్రశ్నించారు యాంకర్.
also read:Bigg Boss:బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్–వర్షిణి రొమాంటిక్ వీడియో వైరల్..!
అల్లు అర్జున్‌తో ఫ్రెండ్‌షిప్ ఎలా ఏర్పడిందంటే? :
దానికి సమాధానంగా ఫరీయ అబ్దుల్లా.. “రీసెంట్‌గా జరిగిన ఒక డాన్స్ ఈవెంట్‌లో మేము కలిశాము. నా డాన్స్ చూశారు అల్లు అర్జున్ సర్. ఆయన సినిమాలోని పాటలకు కూడా నేను డాన్స్ చేశాను. నా డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఆయన నన్ను పొగిడేశారు. చాలా బాగా డాన్స్ చేస్తున్నావ్, మంచి ఫ్యూచర్ ఉంది, మంచి టాలెంట్ ఉంది అంటూ నన్ను పొగిడారు.
ఆ సమయంలోనే దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. అప్పటినుంచి నాకు ఆయన మంచి గైడ్‌గా మారిపోయారు. ఫ్రెండ్ అని చెప్పను.. అంతకన్నా ఎక్కువ. రీసెంట్‌గా జరిగిన బోనాల ఇష్యూ సమయంలో కూడా నా కోసం ఒక మంచి మెసేజ్ పెట్టారు. అది నాకు చాలా బూస్ట్ ఇచ్చింది.
అల్లు అర్జున్ సార్‌ను ఎప్పుడు కలిసినా సరే ఆయన ఎనర్జీ నాకు ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది. ఒక స్పెషల్ వైబ్ కనిపిస్తుంది. ఎటువంటి సిచువేషన్ అయినా సరే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడంలో అల్లు అర్జున్ సర్ చాలా గ్రేట్” అంటూ ఫరీయ అబ్దుల్లా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో :
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫరీయ అబ్దుల్లా మాటలకు ఫిదా అయిపోతున్నారు. హీరోయిన్గా కాకపోయినా కనీసం ఆయన సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయినా ఇస్తే బాగుంటుంది అంటూ ఫరీయ అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.
I absolutely has so love for @alluarjun in my heart, he is like a mentor to me ❤️👏🔥
– actress faria abdullah pic.twitter.com/y4exPsyqSQ
— Allu Babloo AADHF (@allubabloo) September 28, 2026




