Ajay Bhupathi:టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి RX -100 , మంగళవారం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా మంగళవారం సినిమా సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. ప్రియదర్శిని, లక్ష్మణ్ మీసాల వంటి వారి నటన ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా చివరిలో పార్ట్ 2 ఉంటుందని ప్రకటించారు డైరెక్టర్ అజయ్ భూపతి.
మంగళవారం 2 పై స్పందించిన అజయ్ భూపతి
కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం 2 సినిమాని అనౌన్స్మెంట్ చేసినప్పటికీ.. శ్రీనివాస మంగాపురం సినిమాని చేశారు. మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు. జులై 30వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ మంగళవారం 2 పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ALSO READ:Allu Arjun: ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ సంచలన నిర్ణయం!
ఏమన్నారంటే?
అజయ్ భూపతి (Ajay Bhupathi)మాట్లాడుతూ.. మనవాళ్లు మంగళవారం చిత్రం గురించి ఎంత మాట్లాడారో నాకు తెలియదు.. కానీ మలయాళం, తమిళ్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని పొగిడేశారు. రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పారు. లేడీస్ నుంచి కూడా ఈ సినిమాకి అభినందనలు లభించాయి. మంగళవారం చిత్రానికి నేనే నిర్మాత కాబట్టి ఈ సినిమా తర్వాత చేద్దామనుకున్నా.. మంగళవారం 2 సినిమా గురించి నేను ఇప్పుడే మాట్లాడను కానీ ఒకటైతే ప్రామిస్ చేస్తానంటూ తెలిపారు.
ALSO READ:Shivangi Joshi:బుల్లితెర స్టార్ శివాంగి జోషి జీవితంలో ఇన్ని కష్టాలా? బయటపడ్డ షాకింగ్ నిజాలు..!
కొత్త పాత్రలు ఎన్నో..
ఈ సినిమాలో పెట్టే పాత్రలు, ఎలిమెంట్స్, స్టైల్, మేకింగ్ సీన్స్ అన్నీ కూడా చూసి షాక్ అవుతారు. కేవలం ఆడియన్స్ హీరోని చూసి మాత్రమే సినిమాకి రారు కదా కోసం కూడా వస్తారు.. మంగళవారం సినిమాకి కూడా హీరో హీరోయిన్స్ అవసరం లేదు.. ఆ చిత్రానికి పేరు ఉంటే చాలు పార్ట్2లో కొత్తగా ఎంటర్ అయ్యే పాత్రలు కూడా చాలానే ఉంటాయి అని తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్, ఫ్రీక్వెన్ కూడా ఉంటాయని తెలిపారు. మంగళవారం సినిమా తెలుగులో నుంచి ఆస్కార్ లిస్టు లోకి కూడా వెళ్ళింది పార్ట్ 2 కి కూడా అదే క్వాలిటీతో చేస్తానని తెలియజేశారు.




