Allu Arjun: టాలీవుడ్లో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో కలిసి ‘రాకా’ అనే చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. నిన్నటి రోజున అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యారు. అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ హైదరాబాదులో జరగగా.. అక్కడికి అల్లు అర్జున్ హాజరయ్యి అటు అభిమానులను పలకరిస్తూ ఫోటోలను దిగారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ట్రోల్స్ పై స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి.
ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్..
ఇదే సందర్భంలో అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇచ్చారు.. తన ఆర్గనైజేషన్ లో నడుస్తున్న ఈ ఫ్యాన్స్ మీ ఇంట్లో ఉండే సభ్యులందరికీ కూడా అల్లు అర్జున్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సభ్యులకు రూ.5లక్షలు అలాగే జిల్లా స్థాయి సభ్యులకు గాను 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించి కార్డ్స్ ని కూడా ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు అందించడం జరిగింది.ఈ విషయం విన్న అభిమానులు సైతం అల్లు అర్జున్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Shivangi Joshi:బుల్లితెర స్టార్ శివాంగి జోషి జీవితంలో ఇన్ని కష్టాలా? బయటపడ్డ షాకింగ్ నిజాలు..!
హెల్త్ ఇన్సూరెన్స్..
నిన్న జరిగిన ఫ్యాన్స్ మీట్ కి దాదాపుగా వెయ్యి మంది వరకు అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకునే పనిలో పడ్డట్టుగా తెలిసిందే. ముఖ్యంగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా అభిమానులు ముందు ఉండడంతో పాటుగా ఎన్నో రకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్న విషయాన్ని గుర్తించి అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Rana:అప్పుడు అమితాబ్ బచ్చన్..ఇప్పుడు రానా దగ్గుబాటి..ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..!
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప2 చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం రాకా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా మరో సినిమాని చేయబోతున్నారు. ఈయన సినిమా కథలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలోని పాత్రలు విభిన్నంగా ఉండబోతున్నాయి.




