Wednesday, August 5, 2026
HomeLATESTPeddi: పెద్ది సినిమాలో నటుడిని తిడుతున్న ఫ్యాన్స్!

Peddi: పెద్ది సినిమాలో నటుడిని తిడుతున్న ఫ్యాన్స్!

Peddi: పెద్ది సినిమాలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్పపై అభిమానులు తిడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Peddi: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన, హీరోయిన్ జాన్వీ కపూర్ కాంబినేషన్లో ఈ ఏడాది జూన్ 4వ తేదీన విడుదలైన చిత్రం పెద్ది. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో విడుదలయ్యింది. ఇందులో రామ్ చరణ్ యాక్టింగ్ కి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. పెద్ది చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ తదితర నటీనటులు నటించారు. ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఓటిటిలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

పెద్ది నటుడిపై మెగా ఫ్యాన్స్ ఫైర్..

పెద్ది(Peddi) చిత్రంలో ప్రముఖ నటుడుగా పేరుపొందిన తారక్ పొన్నప్ప కూడా నెగిటివ్ పాత్రలో కనిపించారు. ఇందులో వీరభద్రుడు క్యారెక్టర్లో కనిపించిన ఈ నటుడు సినిమాలో రామ్ చరణ్ ని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా చూపించారు. అంతేకాకుండా పెద్ది చిత్రంలో రాంచరణ్ కాలు విరగడానికి కూడా కారణం నటుడు తారక్ పొన్నప్ప గా చూపించారు. ఈ విషయం పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ పొన్నప్ప పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ది చిత్రంలో నటించినందుకు చాలామంది తనని పచ్చి బూతులు తిడుతున్నారని తెలిపారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Rashmika mandanna:గాయం తర్వాత రష్మిక పోస్టు వైరల్!

బండ బూతులు తిడుతూ కామెంట్లు..

ముఖ్యంగా తన ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందులో కామెంట్ సెక్షన్లో పెద్ది కాలు ఎందుకు విరగ్గొట్టారు? అనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. వాటిని చూసి నేను షాక్ అయ్యాను. కొంతమంది బూతులు తిడుతూనే కామెంట్లు చేస్తున్నారు. అందుకే కొన్ని కామెంట్లను కూడా డిలీట్ చేయవలసి వస్తోందని , అది సినిమాలోని కేవలం పాత్ర మాత్రమే అని చెబితే రామ్ చరణ్ ఫాన్స్ వినడం లేదంటూ తెలియజేశారు..దీంతో పెద్ది సినిమాలో ఆ పాత్ర చేయకపోయి ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Khushboo: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి.. ఖుష్బూ పోస్ట్ వైరల్!

పెద్ది సినిమా విశేషాలు..

పెద్ది సినిమా విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.333 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా రూ. 54.55 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా హైలెట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ డాన్స్ కూడా బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. పెద్ది సినిమా ఓటీటి లో తమిళ్, మలయాళం, కన్నడ ,తెలుగు వర్షన్ మాత్రమే ఉన్నది. త్వరలోనే హిందీ వర్షన్ లో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ సుకుమార్ తో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవల రామ్ చరణ్ కు కూడా సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.. సర్జరీ అనంతర కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకుని మరి సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you