Wednesday, July 22, 2026
HomeLATESTNirupam Paritala: కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎంతో తెలుసా?

Nirupam Paritala: కొత్త కారు కొన్న డాక్టర్ బాబు.. ధర ఎంతో తెలుసా?

Nirupam Paritala: కార్తీకదీపం సీరియల్ తో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ తాజాగా కొత్త కారు కొన్నారు.

on
- Advertisement -banner Ad

Nirupam Paritala: తెలుగులో కార్తీకదీపం సీరియల్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో చెప్పాల్సిన పనిలేదు. అంతే పాపులారిటీ అందులో నటించిన నిరూపమ్ పరిటాల (డాక్టర్ బాబు) , ప్రేమి విశ్వనాథ్(వంటలక్క) భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. నిరూపం పరిటాల భార్య మంజులా కూడా బుల్లితెర పైన బాగా ఫేమస్ అయిన యాక్టర్. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్స్ లో నటించే సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి అక్షజ్ ఓంకార్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

కొత్త కారు కొన్న డాక్టర్ బాబు..

తాజాగా నిరూపమ్ పరిటాల(Nirupam paritala) ఒక కొత్త కారు కొన్న విషయాన్ని తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా తెలియజేశారు. తన భార్య మంజులతో కలిసి షో రూమ్ కి వెళ్లి అక్కడ ప్రముఖ ఎంజీ బ్రాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ శుభవార్తను మంజులని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నా కొత్త కారు అంటూ తన భర్తతో దిగిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడమే కాకుండా, వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు , సినీ ప్రముఖులు ఈ దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Varanasi: వారణాసి సినిమాలో మైండ్ బ్లోయింగ్ సీన్ అదే!

కొత్త కారు ధర ఎంతంటే?

ఇక కార్ ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఎలెక్ట్రిక్ కారు ధర అధికంగానే ఉన్నది. ప్రస్తుతం నిరూపం పరిటాల కొన్న కారు ధర రూ.20 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం. నిరూపం పరిటాల ఎవరో కాదు సీనియర్ నటుడుగా పేరు సంపాదించిన నటుడు ఓంకార్ కుమారుడే. 2006లో చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నిరూపం పరిటాల ఆ తర్వాత అత్తారింటికి దారేది, కన్యాదానం, గృహప్రవేశం, రాధకు నీవే రా ప్రాణం , కార్తీకదీపం వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Toxic: లేడీస్ & లేడీస్ అంటూ టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ వీడియో!

నిరూపం పరిటాల కెరియర్..

నిరూపం పరిటాల 2009లో ఫిట్టింగ్ మాస్టర్ అనే చిత్రం ద్వారా వెండితెర పైన అడుగు పెట్టారు. అనంతరం ఎన్టీఆర్ నటించిన రభస సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత 2017 లో నెక్స్ట్ నువ్వే అనే సినిమాకి మాటలు రాసి తన టాలెంట్ తో పేరు సంపాదించారు. ఏది ఏమైనప్పటికీ నిరూపం పరిటాల బుల్లితెర పైన తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you