Wednesday, July 22, 2026
HomeLATESTPeddi Movie:ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న పెద్ది.. ఎప్పుడు ? ఎక్కడ చూడొచ్చంటే?

Peddi Movie:ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న పెద్ది.. ఎప్పుడు ? ఎక్కడ చూడొచ్చంటే?

Peddi Movie: రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Peddi Movie:బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పెద్ది. జూన్ 4వ తేదీన విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారుగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతున్న ఈ సినిమాకి సుమారుగా 5 నిమిషాల 56 సెకండ్ల నిడివి ఉన్న కొత్త సన్నివేశాలను జోడించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది.అయితే ఈమె పాత్రను కించపరిచేలా తెరకెక్కించారనే కామెంట్లు వ్యక్తమైన నేపథ్యంలో ఆ సన్నివేశాలను తొలగించి జాన్వీ కపూర్ కు హైప్ ఇస్తూ 5 నిమిషాల 56 సెకండ్ల నిడివి ఉన్న కొత్త సన్నివేశాలను జోడించారు.

భారీ ధరకు అమ్ముడుపోయిన పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..

అలా కొత్త సన్నివేశాలు జోడించడంతో అటు రామ్ చరణ్ అభిమానులు కూడా మరోసారి ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. థియేటర్లలో మళ్లీ కొత్త సన్నివేశాలు యాడ్ చేయడంతో సినిమా ప్రేక్షకులను అలరిస్తుండగా.. మరొకవైపు ఓటీటీ లవర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. పెద్ది సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సుమారుగా రూ.105 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Save the tiger’s 3: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఫుల్ రివ్యూ.. వెన్నెల కిషోర్ కామెడీ వర్క్ అవుట్ అయ్యిందా?

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇకపోతే ప్రస్తుతం వరుస కలెక్షన్లతో పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ సినిమాను జూలై ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరొకవైపు ఓటీటీ ఆడియన్స్ కోసం థియేటర్లలో కత్తిరించిన జగపతిబాబు, జాన్వీ కపూర్ ల కీలక సన్నివేశాలను తిరిగి జోడించబోతున్నారట. ఏకంగా ఎక్స్టెండెడ్ వెర్షన్ తో సుమారుగా 3 గంటల 25 నిమిషాల నిడివి తో నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Maa inti Bangaram: మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖినే ఎంచుకోవడం వెనుక ఇంత కథ ఉందా?

ఈ ఏడాది అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ మూవీ..

పెద్ది విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇందులో జగపతిబాబు , దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you