Saturday, August 1, 2026
HomeLATESTAmani:క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఛాన్సులు కోల్పోయా.. ఆమని కామెంట్స్!

Amani:క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఛాన్సులు కోల్పోయా.. ఆమని కామెంట్స్!

Aamani: ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో కొంతమంది ప్రవర్తన పై ఊహించని కామెంట్లు చేసింది.

on
- Advertisement -banner Ad

Amani:తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్ తో పాటు, తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ ఆమని. ఈమధ్య పలు చిత్రాలలో నటిస్తూ అలాగే సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం జంబలకిడిపంబ. ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమని తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఆమని.

క్యాస్టింగ్ కౌచ్ పై ఆమని షాకింగ్ కామెంట్..

తన సహజమైన నటనతో ఎన్నో అవార్డులను సంపాదించకున్న ఆమని9Amani).. అగ్ర హీరోలకు జోడిగా ఎన్నో చిత్రాలలో నటించింది. అమ్మ దొంగ, వంశానికి ఒక్కడు, శుభసంకల్పం , ఆ నలుగురు తదితర చిత్రాలతో మంచి పేరు సంపాదించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన ఆమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినీ కెరియర్లో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తెలియజేసింది. ముఖ్యంగా కమిట్మెంట్ విషయం పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Friday ott movies: ఓటీటీ మూవీ.. ఏకంగా 14 సినిమాలు!

60 ఆడిషన్లు ఫెయిల్ అయ్యాయి..

కెరియర్ ప్రారంభంలో ఆమని ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేస్తూ.. అవకాశాల పేరుతో కథలు వినడానికి గెస్ట్ హౌస్లకు, హోటల్స్ కి ఒంటరిగా రమ్మనే వారంటూ తెలియజేసింది. అయితే తాను మాత్రం తన అమ్మని కూడా తీసుకు వస్తానని చెబితే.. వద్దని వారించే వారని , కేవలం ఒక్క కమిట్మెంట్ ఇవ్వలేదనే కారణం చేత సుమారుగా 60 ఆడిషన్లలో తనకు అవకాశాలు రాలేదని, ఆడిషన్స్ ఫెయిల్ అయ్యాయని తెలిపే వారని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది టాలీవుడ్ కంటే కోలీవుడ్ లోనే ఎక్కువగా ఉందంటూ తెలిపింది ఆమని.

- Advertisement -
Advertisement

also read:Priyanka Jain:ప్రియుడితో ప్రియాంక జైన్ రొమాంటిక్ వీడియో.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్!

ప్రతిభ ఉంటే చాలు..

సినీ పరిశ్రమలో ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాల కోసం ఇలాంటి షరతులు విధించడం కొత్తేమీ కాదు. నాటి నుంచి నేటి వరకు ఇవి ఏదో ఒక రూపంలోనే కొనసాగుతున్నాయి అంటూ ఆమని తెలియజేసింది. కానీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి అవకాశాలు పొందకూడదనే పట్టుదలతోనే తన తల్లి మద్దతుతో అటువంటి ఆఫర్లను సైతం తిరస్కరించానని తెలిపింది ఆమని. తన ప్రతిభతోనే స్టార్ హీరోయిన్గా సినీ పరిశ్రమలో రావాలనుకునే ఎంతో మంది యువతులకు ఆదర్శంగా నిలిచింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you