Anandita:సాధారణంగా సినిమా సెలబ్రిటీలకే కాదు సినిమా వారసులకి కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వారు చేసే పనులు లేదా వారిపై బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా తనను ట్రాన్స్ జెండర్ అన్నారని , సర్జరీలు చేయించుకున్నానని, బరువు తగ్గడానికి ఏవేవో ఇంజక్షన్స్ వాడానని ట్రోల్స్ చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక స్టార్ హీరోయిన్ కూతురిగా ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది.
ఎలాంటి ఇంజక్షన్స్ తీసుకోలేదు..
ఆమె ఎవరో కాదు ప్రముఖ రాజకీయ నాయకురాలు, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ(Kushboo) చిన్న కూతురు ఆనందిత (Anandita).తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనందిత సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చిన విమర్శలు, రూమర్స్ పై స్పందించింది. బరువు తగ్గడానికి నేను ఎలాంటి మందులు కానీ శస్త్ర చికిత్స కానీ చేయించుకోలేదు. ముఖ్యంగా బరువు తగ్గడానికి నేను ఓజెంపిక్ , మౌంజారో లాంటి ఇంజక్షన్స్ వాడానని ట్రోల్స్ చేశారు. నేను ఎలాంటి ఇంజక్షన్స్ తీసుకోలేదు. శస్త్ర చికిత్స కూడా చేయించుకోలేదు.
ట్రాన్స్ జెండర్ అంటూ అవమానించారు..
సడన్ గా బరువు తగ్గిన తర్వాత నేను ఒక ట్రాన్స్ జెండర్ అంటూ అవమానించారు..ఇక టీనేజ్ లో ఉన్నప్పుడే అధిక బరువు కారణంగా నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడేమో నేను బరువు ఎలా తగ్గాను అనే విషయంపై రూమర్స్ వింటున్నాను. నాపై ఈ ద్వేషం ఎప్పటికీ ఆగదని నేను గ్రహించాను. ముఖ్యంగా నా ఫిట్నెస్ గురించి వాస్తవాలు తెలియకపోయినా ప్రజలు మాత్రం ఇలాంటి కల్పిత కథలు అల్లుతూనే ఉన్నారు. 2018 నుంచి నేను బరువు తగ్గడానికి ప్లాన్ చేసుకున్నాను. ఈ దశకు చేరుకోవడానికి దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది. నా ఈ కఠోర కృషి వెనుక కష్టం ఎవరికి అర్థం కాదు.. ఇలా అర్థం చేసుకోకుండా ప్రజలు తొందరపాటు నిర్ణయాలకు వచ్చేస్తారు. నేను , మా అక్క అవంతిక ఇద్దరం కూడా చిన్నప్పుడే బొద్దుగా ఉండే వాళ్ళం. ఆ తర్వాత ఊబకాయం బారిన పడ్డాము. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఫిట్గా మారడంపై దృష్టి పెట్టాము.
ALSO READ:Theatre/OTT Movies: జూన్ 3వ వారం వీకెండ్ లో సందడి చేయబోతున్న ఓటీటీ/ థియేటర్ మూవీస్, సిరీలివే!
ఆ హక్కు ఎవరిచ్చారు?
అయినా నాకు కేవలం 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నా బాడీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు?” అంటూ ఆనందిత ప్రశ్నించింది. మొత్తానికైతే బరువు పెరిగినప్పుడు కొన్ని విమర్శలు.. బరువు తగ్గిన తర్వాత ఆ బరువు ఎలా తగ్గింది అనే దానిపై ట్రోల్స్ చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ:Samantha:సమంత మా ఇంటి బంగారం “స్పెషల్ షో”.. ఫస్ట్ రివ్యూ వైరల్!
ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ఆనందిత..
ఆనందిత విషయానికి వస్తే.. ప్రస్తుతం క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఈమె డబుల్ ఆక్యుపెన్సీ చిత్రంతో ఇండస్ట్రీ అరంగేట్రం చేసింది. ప్రస్తుతం మీసయ మురుక్కు 2 కోసం పనిచేస్తోంది. ఇకపోతే ఈమె ప్రొడ్యూసర్ గానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది . గతంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 చిత్రానికి మణిరత్నంతో కలిసి పనిచేసిన ఈమె.. థగ్ లైఫ్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది.


