Wednesday, July 22, 2026
HomeINTERVIEWSMaa inti Bangaram: మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖినే ఎంచుకోవడం వెనుక ఇంత కథ...

Maa inti Bangaram: మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖినే ఎంచుకోవడం వెనుక ఇంత కథ ఉందా?

Maa inti Bangaram: మా ఇంటి బంగారం సినిమాలో సమంత తోడికోడలుగా శ్రీముఖిని ఎంచుకోవడం వెనుక అసలు విషయాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి తెలిపింది.

on
- Advertisement -banner Ad

Maa inti Bangaram: విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాలో చివరిగా తెలుగులో హీరోయిన్ గా నటించింది సమంత.. దాదాపు 2023లో విడుదలైన ఈ సినిమా.. ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన తొలి చిత్రం శుభం లో అతిథి పాత్ర పోషించింది. కానీ పూర్తి లెంగ్త్ పాత్ర పోషించలేదు. అయితే అభిమానులను ఆకట్టుకోవడానికి మళ్లీ తెలుగులో తన స్టార్ డంను తిరిగి దక్కించుకోవడానికి మా ఇంటి బంగారం అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

శ్రీముఖిని ఎంచుకోవడంపై నందిని రెడ్డి కామెంట్..

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా మరొకవైపు ఈ సినిమాలోని కొన్ని పాత్రల ఎంపికపై డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి సమంతా (Samantha)కు తోడికోడలిగా శ్రీముఖి(Sreemukhi) నే ఎందుకు ఎంచుకున్నారు అన్న ప్రశ్నకు నందిని రెడ్డి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.

- Advertisement -
Advertisement

also read:Anandita:ట్రాన్స్ జెండర్ అంటూ నన్ను ఎగతాళి చేశారు.. స్టార్ హీరోయిన్ కూతురు ఆవేదన!

అందుకే శ్రీముఖిని ఎంపిక చేసాం – నందిని రెడ్డి

మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ నందిని రెడ్డి సమంత తోడికోడలిగా శ్రీముఖిని ఎంచుకోవడం గురించి మాట్లాడుతూ..” సమంతా కి సరి సమానంగా తూగే తోడికోడలి పాత్రలో ఒక అమ్మాయిని ఎంచుకోవాలనుకున్నాను. ఆ సమయంలో నాకు శ్రీముఖి తప్ప మరో అమ్మాయి కనిపించలేదు. శ్రీముఖి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించడమే కాకుండా ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే సత్తా ఉన్న అమ్మాయి. అంతేకాదు కొన్ని కొన్ని సన్నివేశాలలో సమంతతో శ్రీముఖికి గొడవ కూడా జరుగుతుంది. ఆ గొడవలో కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయగలగాలి . అందుకే శ్రీముఖి అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని నేను ముందుగానే ఊహించుకున్నాను. అందుకు తగ్గట్టుగానే శ్రీముఖి కూడా అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర చూసిన తర్వాత ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఎందుకు సినిమాలలో నటించడం లేదు అని నేను ఆమెను ప్రశ్నించాను” అంటూ నందిని రెడ్డి తెలిపింది. మొత్తానికైతే శ్రీముఖిని ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు కథ నందిని రెడ్డి బయటకు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -
Advertisement

also read:Theatre/OTT Movies: జూన్ 3వ వారం వీకెండ్ లో సందడి చేయబోతున్న ఓటీటీ/ థియేటర్ మూవీస్, సిరీలివే!

హీరోయిన్గా అవతరిస్తుందా?

ఇక శ్రీముఖి విషయానికి వస్తే పటాస్, అదుర్స్ వంటి షోలలో యాంకర్ గా పనిచేసి.. ప్రస్తుతం పలు టీవీ షోలలో అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమెకు.. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా మంచి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు . ఒకవేళ ఈ సినిమా ఈమెకు మంచి గుర్తింపు అందించిందంటే మునుముందు శ్రీముఖి హోమ్లి పాత్రలతో అదరగొట్టడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి శ్రీముఖి మునుమందు మరిన్ని అవకాశాలు అందుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you