Spirit Movie:స్పిరిట్ సినిమా ప్రభాస్ ది కదా.. ఇప్పుడు వివాదంలో ఇరుక్కోవడం ఏమిటి ? పైగా ఈ సినిమాకి , ఒక మహిళ రైతు కి సంబంధం ఏమిటి? ఆ మహిళా రైతు స్పిరిట్ టీం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేయడం ఏంటి? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతాయి. మరి వివాదంలో స్పిరిట్ సినిమా ఇరుక్కోవడానికి గల కారణం ఏమిటి? సదరు మహిళ రైతు స్పిరిట్ మూవీపై ఆవేదన వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
టైటిల్ వివాదంలో స్పిరిట్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం స్పిరిట్. అయితే ఇదే టైటిల్ తో మరో సినిమా తెరకెక్కడంతో ఇప్పుడు టైటిల్ వివాదం అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరపైకి వచ్చింది. “స్పిరిట్ :ఈజ్ నాట్ వన్” అనే ఒక చిన్న చిత్రాన్ని నిర్మించిన మహిళ రైతు, నిర్మాత నర్సమ్మ.. తాజాగా తమ సినిమా విడుదల ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతోంది. ముఖ్యంగా తాము సినిమా తీసి సర్వం కోల్పోయామని, పెద్ద మనసు చేసుకొని ప్రభాస్ గారే తమను ఆదుకోవాలంటూ వేడుకుంది.
ముందే స్పిరిట్ పేరిట రిజిస్టర్ చేయించామంటూ ఆవేదన..
నర్సమ్మ మాట్లాడుతూ.. “ఎప్పటికైనా ఒక సినిమా తీయాలని ఎన్నో కలలు కన్నాను. అందులో భాగంగానే మా కుటుంబం ఎన్నో కష్టాలు పడి, ఆస్తులు అమ్ముకొని.. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా మా కల మాత్రమే కాదు మా కుటుంబ సభ్యులందరి శ్రమ, ఆశలు, పెట్టుబడుల సమాహారం. సినిమా విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా స్పిరిట్ సినిమా నిర్మాణ సంస్థ టి సిరీస్ మాకు రెండు లీగల్ నోట్లు పంపించింది. స్పిరిట్ పేరుతో మా సినిమా ప్రచారం చేపట్టద్దని, విడుదల చేయకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది . స్పిరిట్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే మేము మా సినిమాను ప్రచారం చేయడం జరిగింది.
ALSO READ:Maa inti Bangaram Review:మా ఇంటి బంగారం రివ్యూ.. తెలుగింటి కోడలు మెప్పించిందా?
టైటిల్ మార్చుకోవడానికి సిద్ధమే..
ఒకసారి మమ్మల్ని ముందే సంప్రదించి ఉంటే టైటిల్ మార్చుకోవడానికి మేము సిద్ధంగా ఉండే వాళ్ళం.. కానీ ముందస్తు చర్చలు లేకుండానే మాకు నోటీసులు పంపడం వల్ల మా సినిమా విడుదల పూర్తిగా ఆగిపోయింది. ఈ వివాదం కారణంగా మా కుటుంబం ఆర్థికంగా, ఇటు సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమా విడుదల కోసం తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విడుదలకు డబ్బులు ఇస్తామని చెప్పిన వారు కూడా వెనక్కి తగ్గారు. ఊరిలో పరువు పోయింది. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు. టైటిల్ పై అభ్యంతరాలు ఉంటే పెద్దల సమక్షంలో చర్చించి సమస్యను పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం అంటూ నర్సమ్మ తెలిపింది.
ALSO READ:Naga bandham trailer:అనంత పద్మనాభ ఆలయ రహస్యాలతో ఆకట్టుకుంటున్న నాగబంధం ట్రైలర్!
వినకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ..
ఇకపోతే పరస్పర సామరస్యంతో చర్చిస్తే తాము టైటిల్ మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపిన నర్సమ్మ.. సమస్యకు పరిష్కారం లభించకపోతే తమ హక్కులను కాపాడుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపింది.


