Deewana movie review:సాధారణంగా ఏ భాషలో అయినా సరే లవ్ స్టోరీ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. అందుకే లవ్ స్టోరీ మూవీలు దాదాపుగా మంచి విజయాన్ని అందుకున్నవే. ఒకప్పటి దేవదాసు, గీతాంజలి మొదలుకొని.. అర్జున్ రెడ్డి , సీతారామం వరకు టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయి. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో వచ్చిన బేబీ, హాయ్ నాన్న లాంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుందా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి మరో ప్యూర్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దీవానా మెప్పించిందా అనే విషయం ఇప్పుడు చూద్దాం..
దీవానా సినిమా కథ..
తరగతి గది, మెయిల్ వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో హర్షిత్ రెడ్డి(Harshith Reddy,) శుభం సినిమా తర్వాత తాజాగా నటించిన కొత్త మూవీ దీవానా. జూన్ 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన యూత్ ఫుల్, ఎమోషనల్ లవ్ స్టోరీ గా సాగే ఈ సినిమాలో హీరోయిన్ గా స్మేహా మణిమేఘలై హీరోయిన్ గా నటించినది. శ్రీకాంత్ సంఘీ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మున్నా (హర్షిత్ రెడ్డి) ఒక నిరుద్యోగి. డిగ్రీ చదివి, ఏ పని చేయకుండా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. అదే సమయంలో మీ సేవ కేంద్రంలో పనిచేసే హీరోయిన్ అమూల్య ని చూసి ప్రేమిస్తాడు. అయితే ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించమని కండిషన్ పెడుతుంది. ఆ లక్ష్యంతో మున్నా ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యలో కుటుంబ సమస్యలు , ప్రేమలో ట్విస్ట్ కథను మలుపు తిప్పుతాయి.
also read:Transfer Trimurthulu:ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ.. 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ వర్కౌట్ అయిందా?
విశ్లేషణ..
ముఖ్యంగా ఈ సినిమా స్లోగా మొదలైనా.. ముందుకు వెళ్లే కొద్ది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరుగుతుంది. ఒకవైపు లవ్ స్టోరీ, మరొకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు చాలా అద్భుతంగా చూపించాడు. నటీనటుల పెర్ఫార్మన్స్ , సినిమాలోని ఎమోషన్స్ , ఒక షాకింగ్ ట్విస్ట్ చివరిగా ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. హీరోయిన్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించింది. నరేష్ మరొకసారి తన నటనతో కంటతడి పెట్టించేసాడు. ఫస్ట్ హాఫ్ లోని హర్షిత్ కి సెకండ్ హాఫ్ లో బాధ్యతాయుతంగా ప్రవర్తించే హర్షిత్ కి మధ్య తేడా కనిపిస్తుంది. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా పూర్తి అయ్యేసరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో మంచి సక్సెస్ అందుకుంది దీవానా.
also read:Bigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
రేటింగ్
2.5/5


