Friday, July 3, 2026
HomeLATESTRajamouli: జక్కన్నకు ప్రపంచం మెచ్చే అరుదైన గౌరవం!

Rajamouli: జక్కన్నకు ప్రపంచం మెచ్చే అరుదైన గౌరవం!

Rajamouli: ధీరుడు రాజమౌళికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించుతో ఒక అరుదైన గౌరవం దక్కడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

on
- Advertisement -banner Ad

Rajamouli:టాలీవుడ్ దర్శకులలో ఫెయిల్యూర్ లేని డైరెక్టర్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. రాజమౌళి కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకున్నారు రాజమౌళి. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు పురిటి గడ్డగా భావించేటువంటి ఫ్రాన్స్ లయోన్ లో ఉన్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ లుమియర్ మ్యూజియంలో రాజమౌళికి(Rajamouli) ఘన సత్కారం లభించింది.

రాజమౌళికి అరుదైన గౌరవం..

అక్కడ ప్రఖ్యాత వాల్ ఆఫ్ ఫిలిం మేకర్స్ రాజమౌళి పేరుతో ఒక శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్టించారు. తద్వారా ఈ గౌరవం క్లింట్ ఈస్ట్ వుడ్ , ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దిగ్గజాల సరసన రాజమౌళి కి లభించింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఫ్రాన్స్ లో ప్రతిష్టాత్మకమైన లుమియర్ మ్యూజియంను సందర్శించాను. అక్కడ నా సినిమాలు ఈగ, RRR వంటి చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి, అక్కడికి వెళ్లిన తరువాత థియరీ ఫ్రీమాక్స్ నన్ను అక్కడి ప్రేక్షకులకు సైతం పరిచయం చేశారు. అలాగే ఒక సర్ప్రైజ్ ఉందని తెలియజేశారు.

- Advertisement -

also read:Obsession:రూ.7 కోట్లతో తీసిన సినిమా రూ.3000 కోట్లు కలెక్షన్స్.. త్వరలోనే తెలుగులో కూడా?

ఎమోషనల్ పోస్టు పంచుకున్న రాజమౌళి..

నన్ను ఈ సినిమా పుట్టిన వీధిలోకి తీసుకువెళ్లగా అక్కడ ప్రపంచ ప్రఖ్యాతుల దర్శకుల పేర్లతో కూడిన కొన్ని ఫలాకాలు కనిపించాయి. అక్కడ ఎరుపు రంగు వస్రం తో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని తాను ఆవిష్కరించాలని చెప్పగా.. దానిపైన నా పేరు చూసి ఒక్కసారిగా ఎమోషనల్ కి గురయ్యాను. ఈ అరుదైన గౌరవానికి ప్రత్యేకించి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు రాజమౌళి. ఈ విషయం పైన పలువురు సినీ ప్రముఖులు , అభిమానులు సైతం రాజమౌళికి అభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

also read:Tamannaah Bhatia: వానలో తడుస్తూ మురిసిపోతున్న తమన్నా.. వీడియో వైరల్!

రాజమౌళి సినిమాలు..

ప్రస్తుతం రాజమౌళి సినిమాల విషయానికి వస్తే .. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లోని ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా, పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఎవరు చూడని ఒక సరికొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఎలాంటి అవార్డులు అందుకుంటారో చూడాలి.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you