The Odyssey:ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి సుమారు 270 మిలియన్ల డాలర్ల గ్రాస్ వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే భారతదేశంలో కూడా ఈ సినిమా దాదాపు 100 కోట్ల మార్క్ కు చేరువ కావడం విశేషం. వీకెండ్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్ లో కూడా థియేటర్లు హౌస్ ఫుల్ కావడం ఈ చిత్రానికి లభిస్తున్న ప్రత్యేక ఆదరణ స్పష్టంగా చూపిస్తుంది.
హోమర్ ఇతిహాసానికి నోలన్ టచ్:
ప్రాచీన గ్రీకు కవి హోమర్ రచించిన ప్రసిద్ధి ఇతిహాసం ‘ఒడిస్సీ’ (The Odyssey) ఆధారంగా ఈ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హ్యాథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, జెండాయా, లుపితా న్యోంగో తదితర ప్రముఖ హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. వారి నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
ALSO READ:Rajamouli:రాజమౌళి ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?
ధనుష్ ను సంప్రదించిన నోలన్ టీం:
ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది . హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ లో ధనుష్ నటనను చూసిన క్రిస్టోఫర్ నోలన్ టీం ఆయనను సంప్రదించినట్లు సినీ వర్గాలలో చర్చ నడుస్తుంది. అయితే ధనుష్ ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. దీనిపై అధికారికంగా సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది.
ALSO READ:Ranabali:విజయ్ దేవరకొండ – రష్మిక రణబాలి సినిమా పోస్ట్ పోన్!
డేట్స్ సమస్యతో చేజారిన అవకాశం :
నిజానికి ఈ పాత్ర పట్ల ధనుష్ కూడా పాజిటివ్ గానే ఉన్నారు అంటూ సమాచారం అందుతుంది. అయితే ఆ సమయంలో ధనుష్ తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో వరుస షూటింగ్లలో బిజీగా ఉండడంతో నోలన్ టీం కోరిన తేదీలను కేటాయించలేకపోవడం వల్లనే ఇంత మంచి అవకాశం చేజార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తపై ధనుష్ లేదా నోలాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ధనుష్ అంతర్జాతీయ స్థాయిలో మరో భారీ గుర్తింపు పొందే అవకాశాన్ని కోల్పోయినట్లేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది




