Wednesday, July 29, 2026
HomeLATESTfauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!

fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!

Fauzi: ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా టీజర్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

on
- Advertisement -banner Ad

fauzi:పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫౌజీ. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. గత కొంతకాలంగా ఫౌజీ సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇటీవలే సినిమా రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ మూడవ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

ఫౌజీ టీజర్ రిలీజ్ డేట్ లాక్..

ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ చూసి ఈ చిత్రం పైన మరోసారి అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫౌజీ(fauzi) సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టీజర్ అంచనాలను పెంచుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ తో మొదలుపెడితే వరుసగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -
Advertisement

also read:Anupama parameswaran: ఎరుపు రంగు చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ!

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది అని సమాచారం. మిగిలిన బ్యాలెన్స్ ఉంటే త్వరలోనే పూర్తి చేసేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.

- Advertisement -
Advertisement

also read:Rao Bahadur Movie:ఓటీటీలోకి సత్యదేవ్ రావుబహదూర్ మూవీ?

రాజా సాబ్ సీక్వెల్ ఉంటుందా?

ఇలా వరుస పాన్ ఇండియా చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. అప్పుడప్పుడు చిన్న డైరెక్టర్లకు కూడా అవకాశాలను కల్పిస్తుంటారు . అలా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజా సాబ్ సినిమా కూడా విడుదలై మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని చివరిలో చూపించారు. మరి రాజా సాబ్ 2 ఉంటుందా ఉండదా అనే విషయం చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you