Rana:టాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు వరుసగా హీరోగా సినిమాలు చేసిన రానా.. ఇప్పుడు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా తనకు నచ్చిన వాటినే ఎంచుకుంటున్నారు.
ప్రత్యేక పాత్రలకే పరిమితమైన రానా:
ఇటీవల రానా పూర్తిస్థాయి పాత్రలో కనిపించిన చిత్రం ‘వేట్టయాన్’. ఈ సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘మిరాయ్’లో అతిథి పాత్రలో కనిపించిన రానా(Rana Daggubati).. ‘కాంత’ వంటి చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే కొత్తగా రానా హీరోగా నటిస్తున్న సినిమాలపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
also read:OTT Movie: భయపెట్టే కొరియన్ హారర్ మూవీ.. తెలుగు ఆడియోతో ఓటీటీ స్ట్రీమింగ్..!
‘జై హనుమాన్’లో కీలక పాత్రలో రానా?:
తాజాగా రానాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో రానా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. 2024 సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. పురాణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ కథలో అనేక ముఖ్యమైన పాత్రలు ఉండనున్నాయి. అందులో మహాభారతంలోని శక్తివంతమైన యోధుడు అశ్వత్థామ పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రను రానా పోషించినట్లు తెలుస్తోంది.
also read:Hyper Aadi:”పేదవాళ్లు మాత్రం అవ్వకండి సర్”.. నాగబాబుకు హైపర్ ఆది ఉచిత సలహా..!
అమితాబ్‌తో పోలిక తెచ్చే పాత్ర:
మహాభారతంలో అశ్వత్థామ పాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. బలం, శౌర్యం, శాపంతో ముడిపడిన ఈ పాత్రకు రానా తన నటనతో కొత్త రూపం ఇవ్వనున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇదే పాత్రను బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో అశ్వత్థామ పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. ఇప్పుడు అదే పాత్రను రానా కూడా చేయబోతున్నారనే వార్తలతో టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దీంతో ‘జై హనుమాన్’పై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరుగుతున్నాయి.




