Friday, July 31, 2026
HomeLATESTAkhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..!

Akhil Lenin:మొదటిసారి తన కెరియర్లో అలాంటి రికార్డు సృష్టించిన అఖిల్..!

Akhil Lenin: మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమా అలాంటి రికార్డు సృష్టించింది.

on
- Advertisement -banner Ad

Akhil Lenin:అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరో అఖిల్ తన కెరియర్ ని ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు అవుతూ ఉన్నా.. సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తనకంటూ గుర్తింపు తెచ్చిన సినిమాలు ఒకటో రెండో ఉన్నా కానీ తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యే చిత్రాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు లెనిన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు అఖిల్ చేసిన చిత్రాలను ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని చెప్పవచ్చు. అఖిల్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.

లెనిన్ తో మంచి సక్సెస్ అందుకున్న అఖిల్..

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించగా.. మొదటి రోజు రూ. 16.7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అఖిల్ కెరియర్ లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి మాస్ క్లాస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో అఖిల్ నటన కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా చేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Nikhil:నిఖిల్‌పై మోనీషా ఫన్నీ కామెంట్.. పల్లవి గౌడ ఎమోషనల్..!

100 కోట్లకు క్లబ్లో మూవీ..

దీంతో లెనిన్(Akhil Lenin) సినిమా రెండు మూడు వారాలలోనే డీసెన్స్ కలెక్షన్స్ రాబట్టడం తో పాటుగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అఖిల్ కెరియర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల మైలురాయి చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని అటు అక్కినేని అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేస్తున్నారు. లెనిన్ సినిమాకి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడం, అఖిల్ యాక్టింగ్ పరంగా హైలెట్ అవ్వడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్య కూడా తండేల్ సినిమాతో రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరారు. ఇప్పుడు అఖిల్ ఎంట్రీ తో అభిమానులు మరింత ఖుషీ అవుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:’శ్రీనివాస మంగాపురం’ఓటీటీ ఫిక్స్.. ఏ ప్లాట్‌ఫామ్‌లో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

నాగచైతన్య సినిమా..

నాగార్జున తన 100వ సినిమా కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.. ఇక అఖిల్ కూడా తన తదుపరి చిత్రం విషయంపై మరింత శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లేలా సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే వృషకర్మ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన చిన్నపాటి గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you