Fauzi:ప్రభాస్ అభిమానులు డిసెంబర్ 3వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందో అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన ఫౌజీ సినిమా కి ప్రీమియర్ షోలు ఉంటాయని నిర్మాత ఇటీవలే తెలియజేశారు. 2026ల బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా ఫౌజీ ఉంటుందని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం నుంచి వచ్చినవి కేవలం రెండు పోస్టర్లు మాత్రమే అయినా సినిమా పైన మరింత అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా పాటలకు చంద్రశేఖర్ చాలా గొప్ప ఆల్బమ్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
స్టిల్ పోస్టర్స్ తోనే సరిపెడతారా?
ఫౌజీ (Fauzi)సినిమా విషయంలో ప్రమోషన్స్ మాత్రం సరికొత్త తరహాలో ఉండబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి వీడియో కంటెంట్ లేకుండా కేవలం స్టిల్స్ పోస్టర్స్ తోని పబ్లిసిటీ చేయబోతున్నారట. ఈ లెక్కన చూస్తూ ఉంటే ట్రైలర్ కూడా రాదని కంటెంట్ అంత సాలిడ్ గా నమ్మకంతో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. సినిమా విజువల్స్ ద్వారా కథను గెస్ చేసే అవకాశం ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అయితే నిజంగానే ఈ విషయంపై చిత్ర బృందం ఫిక్స్ అయ్యారా? లేదా? ఆ ఆలోచనలో ఉన్నారా అనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే
ALSO READ:Peddi: పెద్ది సినిమాలో నటుడిని తిడుతున్న ఫ్యాన్స్!
వేగంగా షూటింగ్..
ఈ ఏడాది డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజాసాబ్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరైన సక్సెస్ అందుకోలేదు. దీంతో అభిమానులు సైతం ఈసారి డైరెక్టర్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ సినిమా పైనే పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉందట. మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా చేస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు మినహాయిస్తే అటుపై కేవలం మూడు నెలలు మాత్రమే ఫౌజీ సినిమా కి సమయం ఉంటుంది.
ALSO READ:Rashmika mandanna:గాయం తర్వాత రష్మిక పోస్టు వైరల్!
ఇదంతా సాధ్యమేనా?
ఇక ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా ఫౌజీ చిత్రానికి సంబంధించి ఫస్ట్ కాపీ నవంబర్ రెండవ వారంలో సిద్ధంగా ఉండాలి ఓవర్సీస్ కంటెంట్ డెలివరీలో ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకోవాలి. మరి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ ఏ విధంగా ఉందో చూడాలి ఇంకా బిజినెస్ డీల్స్ ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు చేయలేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే కల్కి 2 , సలార్ 2, స్పిరిట్ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నిటిలో కూడా ప్రభాస్ సరికొత్త పాత్రలలో కనిపించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఏ చిత్రాలతో ఎలాంటి రికార్డులను ప్రభాస్ తిరగ రాస్తారో చూడాలి మరి.




