Pradeep rawat:తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాలు తన నటనతో ఆకట్టుకున్న నటుడు ప్రదీప్ రావత్ కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గడిచిన కొన్ని గంటల క్రితం ముంబైలోని కోకిల బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో జన్మించారు ప్రదీప్. తెలుగులో మొదటిసారి నటించిన చిత్రం సై. ఇందులో ప్రదీప్ రావత్ బిక్షుయాదవ్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. గజినీ చిత్రం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు సంపాదించారు.
విలనిజంతో అబ్బురపరిచిన నటుడు..
అలాగే ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో కూడా అదిరిపోయే విలనిజంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ ,దేశముదురు, భద్ర తదితర చిత్రాలతో నటించి మెప్పించిన ప్రదీప్ రావత్. చివరిగా గాయపడ్డ సింహంలో నటించారు. ఈయన ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించారు. బెంగాలీ, కన్నడ, మలయాళం, భోజ్పురి , నేపాలి వంటి భాషలలో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి బహుభాష నటుడుగా కూడా పేరు సంపాదించారు ప్రదీప్ రావత్. ప్రతి పాత్రకి కూడా న్యాయం చేయగలిగిన నటుడుగా పేరు సంపాదించారు.
also read:Fauzi:ఫౌజీ సినిమాకి ట్రైలర్ ఉండదా?
ప్రదీప్ రావత్ అంత్యక్రియలు అప్పుడే..
ప్రదీప్ రావత్(Pradeep rawat) ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు. 2022లో ప్రదీప్ కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు సమాచారం . అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్న ఈయన.. నెల రోజులకు పైగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారట..ఈ క్రమంలోనే మంగళవారం రోజున రాత్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రావత్ అంతక్రియలు ఆగస్టు 5న బుధవారం సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఈ విషయం విన్న పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు కూడా నివాళులు అర్పిస్తున్నారు.
also read:Peddi: పెద్ది సినిమాలో నటుడిని తిడుతున్న ఫ్యాన్స్!
ప్రదీప్ రావత్ నటించిన చివరి చిత్రం..
ఇక రావత్ భార్య కళ్యాణి, 18 ఏళ్ల విక్రమాదిత్య అనే కుమారుడు ఉన్నారు. ప్రదీప్ రావత్ సుమారుగా 150 కు పైగా చిత్రాలలో నటించాడు. ఈ నటుడు ఆస్తి కూడా సుమారుగా 30 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రదీప్ రావత్ నటించిన చివరి కన్నడ చిత్రం త్రిశూలం ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. హిందీలో చివరి చిత్రం ఛావా.. ఈ సినిమాలో కూడా అద్భుతమైన నటనని ప్రదర్శించారు ప్రదీప్ రావత్. ఏది ఏమైనప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని చెప్పవచ్చు.




