Saturday, September 19, 2026
HomeLATESTHatah teaser:సరికొత్తగా హతః టీజర్.. చూశారా..?

Hatah teaser:సరికొత్తగా హతః టీజర్.. చూశారా..?

Hatah teaser: కిరణ్ అబ్బవరం నిర్మించిన హతః సినిమా టీజర్ను మేకర్స్ తాజజాగా విడుదల చేశారు. మునుపటి చిత్రాల కంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది.

on
- Advertisement -banner Ad

Hatah teaser:యంగ్ హీరోగా పేరు సంపాదించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు నిర్మాతగా కూడా దూకుడు పెంచుతూ సినిమాలను చేస్తున్నారు. తాను ఎంచుకొనే కథలు కూడా వైవిధ్యమైన కథలతో వీక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తిమ్మరాజు పల్లి టీవీతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టారు. ఆ జోరుని అలాగే కొనసాగిస్తూ..తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న రెండవ చిత్రం హతః . (Hatah teaser)ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

హతః టీజర్ రిలీజ్..

హతః చిత్రాన్ని డైరెక్టర్ అనుష్ గోరాక్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు తాజాగా టీజర్ ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటిదాకా దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. టీజర్ తోనే సినిమా పైన మరింత అంచనాలు పెంచేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో కుమ్ల మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవి, తనూజ ప్రధాన పాత్రలు పోషించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో కొత్త వాళ్లతోనే బలమైన కంటెంట్ను నమ్ముకొని మరి కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్టును మొదలుపెట్టి ముందుకు తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:Shruti Haasan:పీరియడ్స్ మగవాళ్ళకు రావాలి.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!

సినిమాపై అంచనాలు పెంచిన టీజర్..

హతః టీజర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇందులో చూపించిన సస్పెన్స్ కూడా హైలెట్ గా కనిపిస్తోంది. కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలకు సరైన వేదికగా, పండగ సీజన్లను భావించి ఈ చిత్రాన్ని దీపావళి పండుగగా నవంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. హీరోగా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం భారీ విజయాలను అందుకుంటున్న కిరణ్ అబ్బవరం మంచి కథలను నమ్ముతూ సరికొత్త దర్శకులకు అండగా నిలుస్తున్నారు. మరి కిరణ్ అబ్బవరం నిర్మాణ ప్రయత్నం ఈ సినిమాతో ఏ మేరకు మరింత ముందుకు వెళుతుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

ALSO READ:Roja:వెంకటేష్ తో అందుకే సినిమాలు చేయలేదు..ఇన్నాళ్లకి అసలు విషయం చెప్పిన రోజా..!

కిరణ్ అబ్బవరం కెరియర్..

2019లో రాజావారు రాణిగారు అనే సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, క, కా ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం క 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా లో నటించిన రహస్య ఘోరక్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఉన్నారు. అయితే కిరణ్ అబ్బవరం భార్య మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కిరణ్ అబ్బవరం తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you