Varanasi:సూపర్ స్టార్ మహేష్ బాబు కథనాయకుడిగా దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం వారణాసి. ఈ సినిమాపై ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్టు కు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా..? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.
గ్లింప్స్ కంటే పోస్టర్ కి అవకాశాలు:
ప్రతి ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా అభిమానులు వారణాసి నుంచి భారీ విజువల్ ట్రీట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే సినీ వర్గాలల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి గ్లింప్స్ లేదా టీజర్ విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి బదులుగా మహేష్ బాబు కొత్త లుక్ తో కూడిన ఒక ప్రత్యేకమైన బర్త డే పోస్టర్ను మాత్రమే విడుదల చేసే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
also read:Gaurav Khanna:”బాడీలో కి బుల్లెట్ లు”..ఓరి మీ దుంపల్ తెగ..ఇవేం టాస్కులు రా బాబు..!
రాజమౌళి ప్లాన్ ఇదే :
సినిమా ప్రచారంలో రాజమౌళి ఎప్పుడు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉంటారు. కథకు సంబంధించిన కీలక అంశాలను చివరి వరకు చాలా సీక్రెట్ గా ఉంచుతూ సరైన సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆయన శైలి . అదే వ్యూహాన్ని వారణాసి విషయంలోనూ అనుసరిస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కీలక గ్లింప్స్ ను ఇప్పుడే విడుదల చేయకుండా తర్వాతి దశ ప్రమోషన్స్ కోసం దాచిపెట్టినట్లు టాక్. ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ సరవేగంగా కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంతో మేకర్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం. ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు..!!
also read:Nookaraju:”నమ్మి రూ.13 లక్షలు ఇచ్చా.. తిరిగి రాలేదు”.. తోటి ఆర్టిస్ట్‌పై నూకరాజు సంచలన వ్యాఖ్యలు!
వారణాసి చిత్రాన్ని సుమారుగా రూ .1400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ఇంతవరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయడమే కాకుండా , దేశాలలో కూడా విడుదల చేయబోతున్నారు రాజమౌళి అందుకే ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.




