Wednesday, August 5, 2026
HomeLATESTOG 2:ఓజీ 2 పై పవన్ ఫ్యాన్స్ కు నిరాశ!

OG 2:ఓజీ 2 పై పవన్ ఫ్యాన్స్ కు నిరాశ!

OG 2: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ 2 ఉందా లేదా అనే అనుమానాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

OG 2:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వచ్చి భారీ విజయాన్ని అందించిన చిత్రం ఓజీ. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ ను మరొకసారి నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి పాటలు కానీ బిజిఎం కానీ హైలెట్గా నిలిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని తీర్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అంటూ చిత్ర బృందం చివరిలో చూపించింది. ఆమధ్య ఓజి 2(OG 2)పై పలు రకాల వార్తలు వినిపించినా ఇప్పుడు తాజాగా అభిమానులకు నిరాశ కలిగించే వార్త వినిపిస్తోంది.

ఓజీ 2 లేనట్లేనా?

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా పొలిటికల్ వైపు గానే మక్కువ చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తదుపరి సినిమాల విషయంలో ఏ విధమైన క్లారిటీ కూడా ఇవ్వలేదు. కొద్ది నెలల క్రితం కచ్చితంగా ఓజి2 సినిమా ఉంటుందని..ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇప్పట్లో ఇది పట్టాలెక్కేల కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకోవడంతో ఆరోగ్య పరిస్థితి కూడా సర్దు మునుగుతోంది. దీంతో ఈ సినిమా మొదలవ్వడానికి కనీసం మూడు నెలలు పడుతుంది అని.. అప్పటి వరకూ పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

also read:Kajal Aggarwal:30 కోట్ల పెట్టుబడి.. 40 లక్షల వసూళ్లు..కాజల్ కెరీర్‌లో మరచిపోలేని డిజాస్టర్!

అసలు విషయం ఏమిటంటే?

పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ చేయించుకోగా త్వరలోనే మరొక భుజానికి కూడా ఆపరేషన్ జరగాల్సి ఉన్నది. పూర్తిగా కోలుకోవడానికి పవన్ కళ్యాణ్ 6 నెలలకు పైగానే సమయం పట్టేలా కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు నటనకు పూర్తిగా దూరంగా ఉండనున్నారు. డైరెక్టర్ సుజిత్ కూడా ఓజీ విడుదలకు ముందే తన తదుపరిచిత్రం బ్లడీ రోమియో చిత్రాన్ని నానితో కలిసి మొదలుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:Varanasi:మహేశ్ బర్త డే ఆగస్టు 9న గ్లింప్స్ ఉండదా?.. ‘వారణాసి’ టీమ్ ప్లాన్ ఇదేనా..?

డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ని మొదలుపెట్టిన చిత్ర బృందం ఇప్పుడు బ్లడీ రొమియో షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా అయిపోయిన తర్వాతే ఓజీ 2 సినిమా పనులను ప్రారంభించబోతున్నట్లు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రికవరీ అవ్వడానికి ఆరు నెలలకు పైగా సమయం పడుతుంది. కాబట్టి ఈ గ్యాప్ లో నాని ప్రాజెక్టును పూర్తి చేయాలని, అలాగే ఓజీ 2 సినిమా షూటింగ్ 2027 సెకండాఫ్లో మొదలుపెట్టేలా డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసినట్టుగా వినిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఒక ఏడాది తర్వాతే పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయం మీద అటు చిత్ర బృందం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you