Keerthy Suresh:సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన కీర్తి సురేష్ వివాహం అనంతరం పలు రకాల ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా తెలుగు, తమిళం, హిందీ ,మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది. తన సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కీర్తి సురేష్ కంటిమీద కునుకు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్స్ చేస్తూనే ఉన్నాను అన్నట్టుగా తెలియజేసినట్లు ఒక వీడియో ద్వారా తెలిపింది.
విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న కీర్తి సురేష్..
కీర్తి సురేష్(Keerthy Suresh) బిజీ షెడ్యూల్స్ పైన తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేస్తూ.. నిన్న దీన్ని పోస్ట్ చేసేంత శక్తి కూడా నాకు లేకపోయింది. ఒక షూట్ నుంచి మరొక షూటింగ్ కి పరిగెత్తాల్సి వస్తోంది. చివరికి నిద్రపోయేసరికి చాలా లేట్ అవుతోంది. ఏకంగా 41 గంటలపాటు మెలకువగానే ఉన్నానంటూ ఒక వీడియోని షేర్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్న సాయంత్రం 6:00 కు నా రూమ్ నుంచి బయటికి అడుగు పెట్టాను, మళ్లీ ఇప్పుడు ఉదయం 6:00 అవుతోంది దాదాపుగా 24 గంటల తర్వాత తిరిగి నా గదిలోకి అడుగు పెడుతున్నాను. అందులో 20 గంటల పాటు పనిలోనే ఉన్నానని తెలిపింది.
also read:OG 2:ఓజీ 2 పై పవన్ ఫ్యాన్స్ కు నిరాశ!
కీర్తి సురేష్ వీడియో వైరల్..
ఇప్పుడు గంటలో మరో సినిమా షూటింగ్ కి బయలుదేరాలని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఇలాంటి సమస్యల మీద ఫిర్యాదు వంటివి చేయడం మంచిదేనని.. జీవితం అంటే ఇదే కదా? దీన్ని నేను ఒక ఆశీర్వాదంగా తీసుకుంటున్నానని కీర్తి సురేష్ తెలియజేసింది.. అంతేకాకుండా నేను ఎలాంటి కష్టాన్నైనా సరే తట్టుకొని ముందుకి వెళ్తానని అర్థం వచ్చేలా వైట్ టీషర్టు ధరించి మరి మరో వీడియోని షేర్ చేసింది. అలాగే టీ షర్ట్ వేసుకుని కీర్తి సురేష్ సరదాగా క్యాప్షన్ ని జోడిస్తూ మరీ పోస్ట్ పెట్టింది.
also read:Kajal Aggarwal:30 కోట్ల పెట్టుబడి.. 40 లక్షల వసూళ్లు..కాజల్ కెరీర్‌లో మరచిపోలేని డిజాస్టర్!
కీర్తి సురేష్ సినిమాలు..
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో 8 గంటల పని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో కీర్తి సురేష్ ఏకంగా 20 గంటల పాటు వర్క్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్విట్ చూసిన అభిమానులు సైతం షూటింగ్ తో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డోరతి అనే సినిమాలో నటిస్తోంది. సెప్టెంబర్ 25 2026 లో విడుదల చేయబోతున్నారు. అలాగే తెలుగులో రౌడీ జనార్ధన్ చిత్రంతో పాటుగా అనిల్ రావిపూడి సినిమాలో, తమిళంలో ఒకటి, మలయాళంలో ఒకటి, హిందీ వంటి భాషల్లో ఒక సినిమాలలో నటిస్తోంది కీర్తి సురేష్. ఇలా మొత్తం మీద 9 ప్రాజెక్టులలో నటిస్తోందట. మొత్తానికి కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
41 hours awake, still serving effortless vibes @KeerthyOfficial take care of your health papa 🤗 🤗 🤗 🤌 ❤️ ❤️ ❤️ #keerthysuresh pic.twitter.com/lAwNDf7zRq
— ksfanboy (@urstrulyksfan) August 3, 2026




