Kajal Aggarwal:స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ది ఇండియా స్టోరీ”. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిగ్ డిజాస్టర్ గా మారిపోయింది. వ్యవసాయంలో ఉపయోగించే పురుగుల మందులు , వాటిలోని ప్రమాదకర రసాయనాలు, కల్తీ ఆహారం వల్ల ప్రజల అనారోగ్యంపై పడుతున్న ప్రభావం వంటి సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకొని దర్శకుడు చేతన్ డి.కె ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో కాజల్ తో పాటు మురళి శర్మ కూడా కీలక పాత్ర పోషించారు.
హైప్ ఉన్న కలెక్షన్లలో నిరాశ :
సుమారు రూ.30 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంపై విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. విమర్శకుల సమీక్షలు కూడా ప్రతికూలంగా రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించినంత వసూలు సాధించలేకపోయింది. తొలి రోజు కేవలం రూ.16 లక్షల మాత్రమే రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మూడో రోజు ముగిసే సమయానికి మొత్తం వసూలు రూ.46 లక్షలకే పరిమితమైనట్లు సమాచారం. అంటే మూడు రోజుల్లో ఒక కోటి రూపాయలు కూడా రాబట్ట లేకపోయింది. ఇది నిర్మాతలకు నిరాశ కలిగించే అంశంగా మారిపోయింది .
also read:Varanasi:మహేశ్ బర్త డే ఆగస్టు 9న గ్లింప్స్ ఉండదా?.. ‘వారణాసి’ టీమ్ ప్లాన్ ఇదేనా..?
కథలో ప్రధాన అంశం ఇదే :
ఈ సినిమా కథ కల్తీ ఆహారం, రసాయనాలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు చుట్టూ తిరుగుతుంది. కల్తీ ఆహారం కారణంగా రక్త క్యాన్సర్ బారిన పడిన ఓ చిన్నారి మరణించడంతో ఆమె తండ్రి ఆ ఘటనకు బాధ్యులైన వ్యవస్థపై నాసిరకం పురుగుల మందులు సరఫరా చేసే కార్పొరేట్ సంస్థలపై న్యాయపోరాటం ప్రారంభిస్తారు. ఆ పోరాటంలో న్యాయవాదిగా కాజల్ అగర్వాల్ అతనికి అండగా నిలుస్తుంది. కోర్టులో జరిగే పోరాటం నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కధా, కాన్సెప్ట్ అంతా బాగున్న ఈ సినిమాని ఎందుకో జనాలు లైక్ చేయలేకపోయారు. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా మారిపోయింది.
also read:Nookaraju:”నమ్మి రూ.13 లక్షలు ఇచ్చా.. తిరిగి రాలేదు”.. తోటి ఆర్టిస్ట్‌పై నూకరాజు సంచలన వ్యాఖ్యలు!
బాలయ్యతో మరోసారి కాజల్
ప్రజెంట్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా తన కెరీర్ ముందుకు తీసుకెళ్తుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న రామాయణంలో కూడా మండోదరి పాత్రలో నటించింది..కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాజల్ కెరియర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి పెద్దగా కనిపించడం లేదు. కేవలం బాలయ్యతో నటించిన భగవత్ కేసరి సినిమా పేరు తెచ్చి పెట్టింది.ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న NBK 111 చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు అఫీషియల్ గా చిత్ర బృందం ప్రకటించారు.




