Save the tiger’s 3: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెబ్ సిరీస్ లలో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కూడా ఒకటి. మూడు జంటలతో ఫుల్ లెంగ్త్ కామెడీ సీరీస్ గా మొదటి రెండు సీజన్లు కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులోని పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. ఇక సీజన్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూడగా.. ఎట్టకేలకు జూన్ 19 అనగా నేటి నుంచి జియో హాట్ స్టార్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఓటీటీ లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. అదనంగా ఈ సీరీస్ లో ఆడ్ అయిన వెన్నెల కిషోర్(vennela Kishore )తన కామెడీ మార్కు చూపించారా? ఈ మూడు జంటలు మళ్లీ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాయా? అనే విషయం తెలియాలి అంటే సిరీస్ చూడాల్సిందే.
సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కథాంశం..
ముందుగా ఈ సిరీస్ విషయానికి వస్తే ప్రియదర్శి – సుజాత, అభినవ్ గోమటం – పావని, చైతన్య కృష్ణ – దేవియాని శర్మ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది.త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ పై శివ మేక, సాహితీ నిర్మాణంలో మహి వి రాఘవ సమర్పణలో శ్రీరాం ఎరగం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి? ఇది ఎలా మెప్పించింది? అనే విషయానికి వస్తే.. అన్ని సీజన్స్ లాగే ఈ సీజన్ కూడా రెండవ సీజన్ చివరి నుంచి మొదలు పెడతారు. ఇందులో విక్రమ్ (చైతన్య కృష్ణ) నుంచి విడాకులు కావాలని రేఖ (దేవియాని శర్మ) వేసిన కేసు కోర్టులో నడుస్తుంది
అటు భార్య హైమావతి (జోర్దార్ సుజాత) పోరు తట్టుకోలేక అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్న గంట రవి (ప్రియదర్శి) కి అక్కడ పద్ధతులు నచ్చక భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక ఇటు రాహుల్ (అభినవ్ గోమటం) తన భార్య (పావని) తోపాటు బెంగళూరుకు వెళ్లి తన రైటింగ్ వదిలేసి అక్కడ ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ ముగ్గురు కలిసి కూర్చొని తాగుతూ పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయిస్తారు.. అంటే మన పెళ్లి లైఫ్ లో కూడా ఇలా ఉండడానికి కారణం ఇంద్రుడే అని అతడిని తిడుతూ ఉంటారు. ఇదంతా చూసిన ఇంద్రుడు (వెన్నెల కిషోర్) వీరి సంగతేంటో చూడమని తన అసిస్టెంట్ గుప్తా(గుండు సుదర్శన్) కి చెబుతాడు.
also read:Maa inti Bangaram: మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖినే ఎంచుకోవడం వెనుక ఇంత కథ ఉందా?
దీంతో గుప్త వేరే లోకంలో వీళ్ళలాగే ఉండే మరో ముగ్గురిని తీసుకువచ్చి.. వీళ్ళతో మాట్లాడించి వాళ్ళను ఇక్కడికి వీళ్లను అక్కడికి పంపిస్తారు.. కొత్త లోకంలో అంతా సేమ్ ఇదే ఫ్యామిలీతో ఉంటుంది. కానీ పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. గంటా రవి ఎమ్మెల్యేగా, విక్రమ్ పెద్ద కంపెనీకి సీఈవోగా, రాహుల్ పెద్ద రైటర్ గా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కన్న కలలు అక్కడ కనిపించడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు. మరి ఈ ముగ్గురు వేరే లోకంలోనే ఉంటారా? ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఈ మార్పు వల్ల ఎవరికి ఏ ఇబ్బందులు ఎదురవుతాయి? ఇంద్రుడు ఏం చేస్తాడు? భార్యలు భర్తల్ని అర్థం చేసుకుంటారా? అనే విషయం తెలియాలి అంటే తెరపై చూడాల్సిందే.
also read:Anandita:ట్రాన్స్ జెండర్ అంటూ నన్ను ఎగతాళి చేశారు.. స్టార్ హీరోయిన్ కూతురు ఆవేదన!
విశ్లేషణ..
విశ్లేషణ విషయానికి వస్తే.. భార్యల నుంచి తప్పించుకోవాలని ఈ జీవితం వద్దు అనుకునే భర్తలకు వేరే లోకంలోకి షిఫ్ట్ అవ్వడం.. తాము కోరుకున్న లైఫ్ ఉండడం అనే పాయింట్ తో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. రెండు లోకాలు అందరూ ఇద్దరూ ఇద్దరూ గా ఉండే కాస్త కన్ఫ్యూజన్ పాయింట్ తో ఈ సిరీస్ ని కామెడీగానే తెరకెక్కించారు. కానీ వేరే లోకం లైఫ్ లో డబ్బున్నా ఉండే కష్టాలు ఏంటి ? వేరే లోకం వాళ్ళు ఇక్కడ ఏం కష్టాలు పడ్డారు? అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగుతుంది. ఎక్కడ బోరు కొట్టకుండా అక్కడక్కడ నవ్వుతూ చూడొచ్చు. మరి ఈ వెబ్ సిరీస్ కి వెన్నెల కిషోర్ పాత్ర వర్కౌట్ అయ్యిందా లేదా తెలియాలి అంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.


