Friday, June 19, 2026
HomeLATESTPeddi Movie:పెద్దిలో కొత్త సీన్స్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్.. కలిసొస్తుందా?

Peddi Movie:పెద్దిలో కొత్త సీన్స్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్.. కలిసొస్తుందా?

Peddi Movie: రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమాలో కొత్త సన్నివేశాలను యాడ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన బుచ్చిబాబు సనా (Bucchibabu Sana)దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెద్ది. ఇటీవల జూన్ 4న పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అత్యధిక వసూలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

పెద్ది సినిమాలో కొత్త సన్నివేశాలు..

సినిమా అయితే అటు కథ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ జాన్వీ కపూర్(Janhvi Kapoor ) సన్నివేశాలపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు కూడా జాన్వీ సన్నివేశాలపై విమర్శలు గుప్పించారు. దీనిపై బుచ్చిబాబు సనా క్లారిటీ ఇచ్చినప్పటికీ సమస్య సర్దుమణగలేదు. దీంతో రంగంలోకి దిగిన చిత్ర బృందం జాన్వీ కపూర్ సన్నివేశాలపై వస్తున్న వివాదాలను సరిదిద్దే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆ సీన్స్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు.. ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఎప్పటినుంచి యాడ్ చేస్తారు? ఎన్ని నిమిషాల సీన్స్ యాడ్ చేస్తారు ? అనే విషయాన్ని ప్రకటించలేదు.

- Advertisement -

also read:Sreemukhi:పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ.. అప్పుడే పెళ్ళంట!

ఏకంగా 5 నిమిషాల 56 సెకండ్లు..

కానీ ఇప్పుడు తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు సుమారుగా 5 నిమిషాల 56 సెకండ్ల పాటు కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక యాడ్ చేసిన కొత్త సీన్స్ తో కలిపి సినిమాను ఈరోజు నుంచే థియేటర్లలో సందడి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పైగా కొత్త సన్నివేశాలకు సంబంధించిన సెన్సార్ కూడా పూర్తి కావడంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. ఇక మొత్తానికి అయితే ఈరోజు నుంచే అదనంగా యాడ్ చేసిన కొత్త సన్నివేశాలతో ఈ సినిమాను రన్ చేయనున్నారు. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా అనిపిస్తుంది. మరి ఆ యాడ్ చేసిన ఐదు నిమిషాల 56 సెకండ్ల సన్నివేశాలు ఏ విధంగా సినిమాకు కలిసొస్తాయో చూడాలి.

- Advertisement -

also read:Vijay Deverakonda:చిక్కుల్లో పడ్డ విజయ్ దేవరకొండ.. టీసీఏ ఫైర్!

మేకర్స్ మాస్టర్ ప్లాన్..

ఇక మరొకవైపు ఈ సినిమా రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతోంది.2 వారాల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా.. త్వరలో రూ.500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. పైగా కొత్తగా సన్నివేశాలు కూడా యాడ్ చేయడంతో అభిమానులు మళ్లీ థియేటర్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇకపోతే ఈ సినిమాను అభిమానులు రెండేసి సార్లు చూసే విధంగా మేకర్స్ ఇలా కొన్ని సన్నివేశాలను హైడ్ చేసి ఇప్పుడు వాటిని మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేసారు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా మరోసారి పెద్దిని చూసేందుకు రామ్ చరణ్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారటంలో సందేహం లేదు. ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమా రూ.500 కాదు ఏకంగా రూ.700 కోట్ల క్లబ్లో చేరడం కష్టమేమీ కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి చూద్దాం ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందో.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you