Saturday, June 20, 2026
HomeLATESTNaga bandham trailer:అనంత పద్మనాభ ఆలయ రహస్యాలతో ఆకట్టుకుంటున్న నాగబంధం ట్రైలర్!

Naga bandham trailer:అనంత పద్మనాభ ఆలయ రహస్యాలతో ఆకట్టుకుంటున్న నాగబంధం ట్రైలర్!

Naga bandham trailer: విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న నాగబంధం ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Naga bandham trailer:ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మైథాలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రాలకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. అదే నాగబంధం. అనంత పద్మనాభ దేవాలయ రహస్యాలను వెలికి తీసే నేపథ్యంలో కేవలం ఒక భక్తిరస చిత్రంగా మాత్రమే కాకుండా పురాతన రహస్యాలు , విధిరాత, దైవిక శక్తుల కలయికతో ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ALSO READ:Peddi Movie:ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న పెద్ది.. ఎప్పుడు ? ఎక్కడ చూడొచ్చంటే?

- Advertisement -

నాగ బంధం ట్రైలర్ రిలీజ్..

విరాట్ కర్ణ(Virat Karrna) హీరోగా , అభిషేక్ నామా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ సినిమాలో అందాల బ్యూటీ నభా నటేష్(Nabha natesh) కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమాపై అంచనాలు పెంచేలా మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దశాబ్దాల నాటి ఒక రహస్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాగి ఉన్న పవిత్రమైన అత్యంత శక్తివంతమైన ‘బ్రహ్మ కమలం’ అనే ఒక పురాతన వస్తువును దక్కించుకోవాలని ఒక దుష్టశక్తి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

ఆకట్టుకున్న ట్రైలర్..

ఆ బ్రహ్మ కమలాన్ని కాపాడడం కోసం పురాతన అంచనాలు, ఆధ్యాత్మిక రక్షకులు రంగంలోకి దిగుతారు. ఇక శక్తివంతమైన నాగసాధువుల ఆగమనం, చివరిగా రక్షణ శక్తి అయిన నాగబంధం చుట్టూ సాగే కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా కనిపిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ సృష్టించిన ఈ అద్భుతమైన టెంపుల్ సెట్స్ , పవిత్ర స్థలాలు విజువల్స్ కి రిచ్ లుక్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాలు చూస్తుంటే నిజంగా చాలా న్యాచురల్ గా ఉండడం గమనార్హం. జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ , దక్ష నగార్కర్, ఐశ్వర్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు .

- Advertisement -

ALSO READ:Save the tiger’s 3: సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ఫుల్ రివ్యూ.. వెన్నెల కిషోర్ కామెడీ వర్క్ అవుట్ అయ్యిందా?

అంచనాలు పెంచుతూ..

ఈ చిత్రాన్ని ఎన్ఐకె స్టూడియోస్ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపూ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే మైథాలజీ మిస్టరీ ప్రేక్షకులకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమైన ఈ నాగబంధం జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ను వసూలు చేస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే.. కచ్చితంగా ఒక మంచి విజువల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you