Friday, July 3, 2026
HomeLATESTSukumar:రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న సుకుమార్!

Sukumar:రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్న సుకుమార్!

Sukumar: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న కొత్త మూవీలో మళ్లీ ఫ్లాప్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Sukumar:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది నటించిన తాజా చిత్రం పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమా RC -17 డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. రంగస్థలం సినిమా భారీ విజయం తర్వాత మళ్లీ వీరు కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ చేయడంతో సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.

మళ్లీ రామ్ చరణ్ కు జోడీగా..

ఇటువంటి సందర్భంలోనే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో కూడా రాంచరణ్(Ram charan) కి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీను(Kiara Advani) మళ్లీ ఎంపిక చేసేలా పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లో వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ సినిమాలు రాగా, ఈ రెండు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాజెక్టు గనుక ఓకే అయితే చరణ్ తో కియారాకు ఇది మూడవ సినిమా అని చెప్పవచ్చు.

- Advertisement -

also read:Nani:హీరో నానికి గాయం.. ఆందోళనలో అభిమానులు.!

ఆందోళనలో ఫ్యాన్స్..

డైరెక్టర్ సుకుమార్ మాత్రం పుష్ప తరహాలో ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రను చాలా పవర్ ఫుల్ గా చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ పాత్రకు కియారా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అనే అభిమానులు వ్యక్తం చేస్తూ ఉండగా, చిత్ర బృందం మాత్రం చాలా నమ్మకంతో ఉంది. అయితే అభిమానులు మాత్రం గతంలో రామ్ చరణ్, కియారా కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ కావడం చేత దీంతో కియారా కాకుండా మరో హీరోయిన్ ని ఎంపిక చేస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందేమో చూడాలి.

- Advertisement -

also read:Pawan Kalyan: వారికోసం పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..!

మళ్లీ హిట్ కొడతారా?

రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఈ ఏడాది అభిమానులను బాగా అలరించగా, 2024లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాతో అలరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. దీంతో చాలా గ్యాప్ తీసుకొని మరీ సుకుమార్ , రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు . మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you