Saturday, July 11, 2026
HomeLATESTI Nobody Movie Review: పృథ్వీరాజ్ సుకుమార్ థ్రిల్లర్ ఎలా ఉంది?

I Nobody Movie Review: పృథ్వీరాజ్ సుకుమార్ థ్రిల్లర్ ఎలా ఉంది?

I Nobody Movie Review: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఐ నోబడి' (Nobody) మూవీ ఎలా ఉంది? కథ, నటీనటుల ప్రదర్శన, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు, ప్లస్-మైనస్ పాయింట్లు, చివరి తీర్పుతో పూర్తి మూవీ రివ్యూ చదవండి.

on
- Advertisement -banner Ad

I Nobody Movie Review:మలయాళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు జనాల్లో ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఆ సినిమాలో కచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం తప్పకుండా హైలైట్ అవుతుందని అందరి నమ్మకం. మరీ ముఖ్యంగా మలయాళంలో కొంతమంది హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అవి పక్కా బ్లాక్‌బస్టర్ అవుతాయని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమార్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన, ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB29’ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘ఐ నోబడి'(I Nobody Movie) ఇందులో పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై సుప్రియా మేనన్, ముఖేష్ ఆర్. మెహతా, సి.వి. సారథి నిర్మాణంలో బషీర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమా కథ హైలైట్‌గా మారింది.

- Advertisement -

also read:Bigg Boss: బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన్న జబర్దస్త్ బ్యూటీ!

కథ విషయానికొస్తే:

రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమార్)(prithviraj sukumaran) ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య మీరా (పార్వతి తిరువోతు) కూడా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, తమ ఇద్దరు పిల్లలను చదివిస్తూ సంతోషంగా జీవిస్తుంటారు. అయితే మీరాకు ఓ బ్యాంక్ మేనేజర్‌తో అఫైర్ ఉంటుంది. ఈ విషయం రాజీవ్ కు ఆలస్యంగా తెలుస్తుంది. దీంతో అతడిని భయపెట్టాలని గన్ తీసుకుని బ్యాంకుకు వెళ్తాడు. కానీ అదే సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకులోకి వచ్చి దాదాపు రూ.17 కోట్లను దోచుకుని, రాజీవ్ ను కొట్టి బంధించి తమ వెంట తీసుకెళ్తారు.

- Advertisement -

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. దారి మధ్యలో రాజీవ్ ను కొట్టి పడేసి వెళ్తున్న ఆ ముగ్గురు దొంగలు యాక్సిడెంట్‌లో స్పాట్‌లోనే చనిపోతారు. దీంతో రాజు ఆసుపత్రిలో ఉండిపోతాడు. కానీ రూ.17 కోట్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. దీంతో కొంతమంది రాజీవ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తారు. మరికొందరు అయితే ఈ దొంగతనంలో రాజీవ్ కూడా భాగస్వామి అని, దొంగలను చంపేసి డబ్బులు తానే దాచుకున్నాడని అనుకుంటారు. అంతేకాదు, కొంతమంది “అవి మా కష్టార్జిత డబ్బులు… మాకు ఇవ్వు” అంటూ రాజీవ్ ను ఇబ్బంది పెడుతుంటారు. పోలీసులు కూడా రాజీవ్ ను తీవ్రంగా విచారిస్తుంటారు.

ఈ దొంగతనం కారణంగా ఓ పోలీస్ అధికారికి ఉద్యోగం పోతుంది. దీంతో అతను ఎలాగైనా ఆ డబ్బును కనిపెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు ప్రజలు కూడా ఆ డబ్బు ఎక్కడ దాచారో వెతుకుతుంటారు. అసలు ఆ రూ.17 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఆ దొంగలు ఎవరు? ఈ దొంగతనం చేయించింది ఎవరు? మధ్యలో రాజీవ్ ఎలా ఇరుక్కున్నాడు? రాజీవ్ నిజాన్ని ఎలా కనుక్కున్నాడు? చివరికి ఏమైంది? ఆ డబ్బు బ్యాంక్ యాజమాన్యానికి దక్కిందా? రాజీవ్ -మీరా బంధం ఏమైంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

also read:Shobhan Babu:నటుడు శోభన్ బాబు ఇంట విషాదం?

సినిమా విశ్లేషణ”

పృథ్వీరాజ్ సుకుమార్ ఇప్పటికే పలు తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అందుకే ఆయన కొత్త సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఒక సామాన్య వ్యక్తి అనుకోకుండా ఓ పెద్ద దొంగతనంలో ఇరుక్కొని, అందరూ అతడినే అనుమానిస్తే అతని బాధ ఎలా ఉంటుంది? అతని కుటుంబం ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుంది? ఒక మనిషిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే, ఆ వ్యక్తి మోసం చేసి అఫైర్ పెట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? అనే అంశాలతో దర్శకుడు సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు.

సినిమా ప్రారంభంలోనే బ్యాంక్ దొంగతనం, రాజీవ్ ను కట్టి తీసుకెళ్లే సన్నివేశాలతో ఆసక్తికరంగా మొదలవుతుంది. ఒకవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూనే, మరోవైపు అనుకోని పరిస్థితుల్లో చిక్కుకున్న సామాన్య వ్యక్తి ఎలా ఇబ్బంది పడతాడో బాగా చూపించారు. పోలీసులు కూడా డబ్బు కోసం రాజీవ్ వెంటే పడటం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సినిమా మరో లెవెల్‌కు వెళ్తుంది. ఒక్కో సీన్ ఆశ్చర్యపరుస్తూనే, కొన్ని చోట్ల కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా మన ఇళ్లలో జరిగే సరదా సంభాషణలు కూడా సినిమాలో కనిపిస్తాయి.

సెకండ్ హాఫ్ ప్రారంభంలో డబ్బు చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ డబ్బు కోసం పోలీసులు వెతకడం, రాజీవ్ కూతురు కిడ్నాప్ కావడం వంటి అంశాలు “నెక్స్ట్ ఏం జరుగుతుంది?” అనే ఆసక్తిని పెంచుతాయి. అయితే చివర్లో మాత్రం కథను కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. పాపకు సంబంధించిన ఎమోషన్స్ చూపించినా అవి ప్రేక్షకులను అంతగా హత్తుకోవు. “నేను ఎవరికీ ఏమీకాను… ఎవరికి నేను అక్కర్లేదు” అనే భావంతోనే ఈ టైటిల్ పెట్టినట్టుగా కొంతమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు కథ బాగున్నా, క్లైమాక్స్ కొంచెం వీక్ అయిందని, ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త డెప్త్ ఉండి ఉంటే సినిమా మరింత బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. టోటల్‌గా చెప్పాలంటే మాత్రం ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి ఒకసారి హ్యాపీగా చూసే వన్‌టైమ్ వాచ్ మూవీ.

నటీనటుల యాక్టింగ్:

ఓ సాధారణ తండ్రిగా, ప్రేమించే భర్తగా పృథ్వీరాజ్ సుకుమార్ చాలా బాగా నటించారు. యాక్షన్ సీన్స్‌లో కూడా ఆకట్టుకున్నారు. భార్యగా, తల్లిగా పార్వతి తిరువోతు సహజమైన నటనతో మెప్పించింది. ఇద్దరు పిల్లలు కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. ముఖ్యంగా చిన్న కూతురు పాత్ర చేసిన చిన్నారి ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ కూడా ఆకట్టుకుంటుంది. రీ-రికార్డింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. చాలా సీన్స్‌లో డిటైలింగ్ చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. మలయాళ సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తూ రెండు హిందీ పాటలు పెట్టడం ప్రేక్షకులకు కొంత విసుగు తెప్పించినట్లు టాక్ వచ్చింది. కథ కొత్తదే అయినా, కథనంలో రాసుకున్న క్లైమాక్స్ పూర్తిగా పండలేదు. సాంకేతికంగా సినిమా బాగా తెరకెక్కింది. నిర్మాణ విలువలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. అయితే ఆ ఖర్చుకు తగిన ఫలితం వస్తుందా అనేది మాత్రం సందేహమే. చాలా వరకు కేరళలోని రియల్ లొకేషన్లలో షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం షార్ప్‌గా కట్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఫైనల్ వెర్డిక్ట్:

మొత్తంగా ‘ఐ నోబడి’ సినిమా ఒక సామాన్య వ్యక్తి అనుకోకుండా ఎదుర్కొన్న ఆరోపణలు, సస్పెన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్. ఈ తరహా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 2.75/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you