Tuesday, July 21, 2026
HomeLATESTAishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. 'వంద కోట్లు ఇచ్చినా రాను' అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

Aishwarya Lekshmi:ట్రోల్స్‌తో విరక్తి.. ‘వంద కోట్లు ఇచ్చినా రాను’ అంటూ ఐశ్వర్య లక్ష్మి స్ట్రాంగ్ స్టేట్‌మెంట్!

Aishwarya Lekshmi:కేరళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. ట్రోలింగ్, మార్ఫింగ్ ఘటనల తర్వాత తీసుకున్న నిర్ణయం తన జీవితానికి ప్రశాంతతను తీసుకువచ్చిందని తెలిపారు.

on
- Advertisement -banner Ad

Aishwarya Lekshmi:కేరళకు చెందిన ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా పై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణంతో పాటు సోషల్ మీడియా వల్ల ఎదురైన చేదు అనుభవాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా చురుగ్గా ఉండే దానిని అభిమానులతో నేరుగా మమేకమయ్యే దానినని తెలిపారు. అయితే కొందరు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేయడంతో పాటు అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తన మనసును తీవ్రంగా బాధించిందని చెప్పారు.

ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాను సోషల్ మీడియాకు కాదు:

సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ వ్యాఖ్యల కారణంగా అందరూ తనను ద్వేషిస్తున్నారని భావన కలిగేదని ఐశ్వర్య లక్ష్మి వెల్లడించారు. అదే కారణంగా సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యానని చెప్పారు. ప్రస్తుతం తాను ప్రేక్షకుల ప్రేమను సినిమాల ద్వారానే పొందుతున్నాను అ..ని అదే తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. 100 కోట్లు ఇచ్చిన సరే మళ్ళీ సోషల్ మీడియా జోలికి వెళ్ళను.. ఇది నేను స్ట్రాంగ్ గా తీసుకున్న డిసిషన్ ..ఇప్పుడు దానికి దూరంగా ఉండటమే నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement

also read:Salman Khan :వైరల్ వీడియోతో సల్మాన్ ఆరోగ్యంపై ఊహాగానాలు.. అసలు నిజం ఏంటి?

గట్టా కుస్తీ2 విజయం పై ఆనందం :

తాజాగా విడుదలైన గట్టా కుస్తీ 2 సినిమా విజయంపై కూడా ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)స్పందించారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందడంతో సంతోషంగా ఉందని చెప్పారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రధాన అంశంగా తీసుకొని రూపొందించిన ఈ సినిమా కొరకు ఎంతో ప్రత్యేకమైనదిగా వెల్లడించారు. అలాంటి సామాజిక సందేశం ఉన్న కథలలో నటించే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరో!

వరుస ప్రాజెక్టులతో బిజీ:

ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రంలో పోలీస్ అధికారిని పాత్రలో నటిస్తున్నారు. అలాగే ‘తీవియన్‌ పొట్రు’, ‘లవ్‌’ వెబ్ సిరీస్లలో కూడా ఆమె కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనకు కొత్త కోణాలను జోడిస్తున్న ఈ నటి త్వరలో ఓ తెలుగు ప్రాజెక్టుతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సినీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య లక్ష్మి త్వరలోనే తెరపై చూడబోతున్నారని ఆసక్తి నెలకొంది..!!

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you