Monday, June 29, 2026
HomeLATESTDilraju:ఆ సినిమాల విషయంలో తప్పు చేశా.. దిల్ రాజ్ కామెంట్స్ వైరల్!

Dilraju:ఆ సినిమాల విషయంలో తప్పు చేశా.. దిల్ రాజ్ కామెంట్స్ వైరల్!

Dilraju: టాలీవుడ్ బడానిర్మాత దిల్ రాజు తాజాగా ఆ సినిమాల విషయంలో తప్పు చేశాను అంటూ కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

on
- Advertisement -banner Ad

Dilraju:తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా దిల్ రాజు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎంతోమంది దర్శకులను, నటీనటులను పరిచయం చేసిన ఘనత అందుకున్న దిల్ రాజు.. సక్సెస్ఫుల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కానీ ఈమధ్యకాలంలో ఆయన బ్యానర్ పైన వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు (Dilraju) మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో కొన్ని తప్పులు చేశానని పలు విషయాలను తెలియజేశారు.

సాటిలైట్ హక్కుల ఒప్పందంపై దిల్ రాజు కామెంట్..

కెరియర్ ప్రారంభంలో నిర్మాతగా తాను నిర్మించిన దిల్, ఆర్య, భద్ర వంటి సినిమాల శాటిలైట్ హక్కులను ఎలాంటి కాలపరిమితి లేకుండా విక్రయించేసానని, ఆ తర్వాత అలా చేయకూడదని తనకు అర్థమయింది అని తెలిపారు. అలా ఆ తప్పు తెలుసుకొని బొమ్మరిల్లు సినిమా నుంచి 5 లేదా 10 సంవత్సరాల కాల పరిమితితోనే సాటిలైట్ హక్కుల ఒప్పందాన్ని మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. దిల్ సినిమా తో తన కెరీర్ ని నిర్మాతగా ప్రారంభించిన దిల్ రాజు.. ఆ సినిమా హక్కులను 35 లక్షలకు, అలాగే ఆర్య సినిమా హక్కులను 45 లక్షల రూపాయలకు అమ్మేశానని తెలియజేశారు.

- Advertisement -

బ్యాడ్ రివ్యూస్ సినిమాను దెబ్బతీస్తున్నాయి – దిల్ రాజు

దిల్ సినిమాలో నితిన్ హీరోగా నటించగా.. డైరెక్టర్ వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన భద్ర సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మరికొన్ని విషయాలను పంచుకుంటూ కోవిడ్ తర్వాత ఓటిటి మార్కెట్ పెరగడం , రివ్యూస్ తో సినిమాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా చేస్తోందని తెలియజేశారు.

also read:OTT:1978లో జరిగిన నిజమైన సంఘటనల కథ.. ఓటీటీను ఊపేస్తున్న వెబ్ సిరీస్..

- Advertisement -

కంటెంట్ ఉంటేనే సక్సెస్..

ఏదైనా సినిమాకు యావరేజ్ టాక్ వస్తే మాత్రం ప్రేక్షకులు ఓటీటీలోకి వస్తుంది కదా చూద్దామనుకుంటున్నారు. థియేటర్లకు మాత్రం రావడం లేదు. కేవలం సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలియజేశారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ వేసే పోస్టర్లకు, లెక్కలకు సంబంధం లేదని, సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయితే ఎవరు ఆపలేరు. అలాగని బాగాలేని సినిమాను ఎవరి పోస్టర్లు వేసినా కూడా ముందుకు తీసుకు వెళ్లలేరు కదా అంటూ తెలియజేశారు.

also read:Film industry: ఇద్దరు హీరోయిన్స్ నడుమ డాన్స్ తో అదరగొట్టేస్తున్న మెగాస్టార్!

- Advertisement -

సోదాలు ఎక్కువవుతున్నాయి..

అలాగే 8 ఏళ్లకు ఒకసారి ప్రతి బిజినెస్ మాన్ ఇంట్లో కూడా ఏదో ఒక సోదాలు చేస్తూ ఉండడం సహజమే , తాము చెప్పిన లెక్కలకు పుస్తకాలలో ఉన్న వాటికి సరిపోతుందా లేదా అని చూస్తారంటూ తెలియజేశారు. అలాగే ప్రస్తుతమున్న సినిమాలలో బడ్జెట్ లో అధిక భాగం హీరోల రెమ్యూనరేషన్ కే వెళ్లిపోయేది కానీ ఈ మధ్యకాలంలో షేరింగ్ విధానంలో రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల నిర్మాతలకు కాస్త రిలీఫ్ అనిపిస్తోందని తెలియజేశారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you