Thursday, July 2, 2026
HomeLATESTOTT:ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో అంటే?

OTT:ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో అంటే?

OTT: ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూలై 2 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

on
- Advertisement -banner Ad

OTT:ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ఈమధ్య మంచి ఆదరణ లభిస్తోంది. ఇంటెన్స్ కథలని చూసేందుకు కూడా ప్రేక్షకులు మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అలా ఇప్పుడు తాజాగా మరొక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో సముద్ర కని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఇసకపట్నం. జూలై 2 2026న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సిరీస్ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది.

ఆకట్టుకుంటున్న మరో కొత్త సిరీస్..

దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ సిరీస్ మరింత చేరుకొని అవకాశము ఉంటుందని చిత్ర బృందం ఇలా ప్లాన్ చేశారు. ఈ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) తో పాటుగా సునీల్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, నరేష్ అగస్త్య , రోహిణి తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ లోని ప్రతి పాత్ర కూడా కథను మరింత ముందుకు నడిపించేలా ఉండబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు.

- Advertisement -

also read:OTT Movies: ఓటీటీలో భయపెడుతున్న తెలుగు హర్రర్ మూవీ?

ట్రైలర్ తోనే అంచనాలు..

ఇటీవలే విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ మొత్తం సముద్రం చుట్టూ, పోర్ట్ కి సంబంధించిన వెబ్ సిరీస్ అన్నట్లుగా కనిపిస్తోంది. అధికారం, ప్రతీకారం, రాజకీయ ప్రభావం, నేరాలు నేపథ్యంలో కొనసాగే కథ అన్నట్లుగా తెలుస్తోంది. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని మరీ నడిపిస్తున్న యాజమానికి ఎదురుగా ఒక నిజాయితీ గల మహిళ పోరాటం ప్రధాన ఆకర్షనీయంగా నిలుస్తోంది. అలాగే ఈ సిరీస్లో తండ్రి కూతుర్ల మధ్య జరిగే వార్ ఇంటెన్సీగా కొనసాగుతున్నట్లు చూపించారు. ఆమె ఆ వ్యవస్థను ఎలా సవాల్ చేస్తుంది? వాటిని ఎలా ఎదుర్కొంటుంది? ఆ పోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అలా ఎన్నో అంశాలను ఉత్కంఠ భరితంగా ట్రైలర్ లో చూపించారు.

- Advertisement -

also read:Pooja Hegde:పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే.. అదృష్టం కలిసొచ్చేనా?

సక్సెస్ అందుకుంటుందా?

ఇసకపట్నం వెబ్ సిరీస్ లో బలమైన కథ , అనుభవగ్యులైన నటీనటులు సస్పెన్స్ తో కూడిన కథనం కావడం చేత ఈ సిరీస్ కి ప్రధాన బలంగా మారనుంది. మరి ఈ వెబ్ సిరీస్ కి ఆదరణ ఎలా ఉంటుందో తెలియాలి అంటే జులై రెండవ తేదీ వరకు ఆగాల్సిందే. ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే తన కెరియర్లో ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలనే ఎంచుకుంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే 50కి పైగా సినిమాలలో నటించిన ఘనత అందుకుంది ఐశ్వర్య రాజేష్. మరి ఈ వెబ్ సిరీస్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you